EMRS | దేశ వ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వంద‌నో, రెండు వంద‌ల పోస్టులు కాదు.. ఏకంగా 38 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. వ‌చ్చే మూడేండ్ల‌లో 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 3.5 ల‌క్ష‌ల మంది ఆదివాసీ విద్యార్థుల‌కు విద్యాబోధ‌న అందించ‌డ‌మే లక్ష్యంగా ఈ […]

EMRS | దేశ వ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వంద‌నో, రెండు వంద‌ల పోస్టులు కాదు.. ఏకంగా 38 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. వ‌చ్చే మూడేండ్ల‌లో 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 3.5 ల‌క్ష‌ల మంది ఆదివాసీ విద్యార్థుల‌కు విద్యాబోధ‌న అందించ‌డ‌మే లక్ష్యంగా ఈ నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

ఈ 38 వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ ట్రైబ‌ర్ స్టూడెంట్స్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివ‌రాలు, అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు తెలుసుకునేందుకు https://emrs.tribal.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

పోస్టుల వివ‌రాలు ఇవే..

ప్రిన్సిప‌ల్స్ - 740
వైస్ ప్రిన్సిప‌ల్స్ -740
పీజీటీ టీచ‌ర్లు - 8880
టీజీటీ టీచ‌ర్లు - 8840
ఆర్ట్ టీచ‌ర్లు - 740
మ్యూజిక్ టీచ‌ర్లు - 740

పీఈటీలు - 1480
లైబ్ర‌రీయ‌న్లు - 740
కౌన్సెల‌ర్ - 740
స్టాఫ్ న‌ర్సులు - 740

హాస్ట‌ల్ వార్డెన్స్ - 1480
అకౌంటెంట్ - 740
సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ - 740
జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ - 1480
క్యాట‌రింగ్ అసిస్టెంట్ - 740

డ్రైవ‌ర్ - 740
ఎల‌క్ట్రిషీయ‌న్లు, ప్లంబ‌ర్లు - 740
ల్యాబ్ అటెండెంట్ - 740
గార్డెన‌ర్ - 740
కుక్ - 470
మెస్ హెల్ప‌ర్ - 1480
చౌకీదార్ - 1480
స్వీప‌ర్ - 2220

Updated On 7 Jun 2023 2:00 AM GMT
subbareddy

subbareddy

Next Story