రెండు ఉదంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు మొట్టికాయలు సొంత పార్టీ ఎమ్మెల్యే పోరు భ‌రించ‌లేక శ్రావ‌ణి రాజీనామా మానేరు అనుమ‌తుల‌ను త‌ప్పుప‌ట్టిన ఎన్‌జీటీ విధాత: మితిమీరిన అధికారంతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి బెడిసి కొడుతున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఒకటి కాదు, రెండుకాదు.. ఒకే రోజు.. నాలుగు ఉదంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు, ఎన్‌జీటీ తప్పు పట్టాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర […]

  • రెండు ఉదంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు మొట్టికాయలు
  • సొంత పార్టీ ఎమ్మెల్యే పోరు భ‌రించ‌లేక శ్రావ‌ణి రాజీనామా
  • మానేరు అనుమ‌తుల‌ను త‌ప్పుప‌ట్టిన ఎన్‌జీటీ

విధాత: మితిమీరిన అధికారంతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి బెడిసి కొడుతున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఒకటి కాదు, రెండుకాదు.. ఒకే రోజు.. నాలుగు ఉదంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు, ఎన్‌జీటీ తప్పు పట్టాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదం కావటమే కాదు, వాటిని కోర్టు తప్పు పట్టడం గమనార్హం. అలాగే.. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా.. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవికి రాజీనామా చేయటం బీఆర్‌ఎస్‌ను కుదిపేస్తున్నది.

గవర్నర్‌కు షాక్‌: గణతంత్ర వేడుకలు అక్కడే నిర్వహించుకోవాలని లేఖ

ఎర్ర‌బెల్లికి గ‌న్‌మెన్ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశం..

బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గన్‌మెన్ల తొలగింపుపై ఆయన దాన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తూ రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దారు వాదనలను విన్న హైకోర్టు గన్‌మెన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు బీఆర్‌ఎస్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయాన తమ్ముడు. ఆయన ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ఆ నేపథ్యంలోనే గన్‌మెన్లను తొలగించారన్న ఆరోపణలున్నాయి.

ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్ల పునరుద్ధరణ

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన హైకోర్టు..

కరోనా కారణంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలను రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ లేఖ వ్యవహారం హై కోర్టు దాకా పోవటంతో.. ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.

రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహించాల్సిందే: హైకోర్టు సీరియస్‌

సభలు, సమావేశాల్లో లేని కొవిడ్‌ నిబంధనలు గణతంత్ర దినోత్సవానికి ఎందుకని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆ క్రమంలోనే.. గణతంత్ర ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సూచించింది. పరేడ్‌తో కూడిన వేడుకలను నిర్వహించి ప్రజలకు వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

జ‌గాత్యాల మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ రాజీనామా..

కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి పదవికి రాజీనామా చేస్తూ.. స్థానిక ఎమ్మెల్యే దాష్టికంపై కన్నీరుమున్నీరైంది. గత మూడేండ్లుగా అడుగడుగునా అవమాన పరుస్తున్నా, అనేక విధాలుగా వేదిస్తున్నా భరించాననీ, ఇక తన వల్ల కావటం లేదని మీడియా ముఖంగా బోరున విలపించారు.

BRSకు షాక్‌.. దొరా మీకో దండం.. జ‌గిత్యాల మున్సిపల్‌ చైర్‌ప‌ర్స‌న్ శ్రావ‌ణి రాజీనామా!

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశంచి.. దొరా.. సంజయ్‌ కుమార్‌ దొరా.. మీరే గెలిచారు, మేం ఓడి పోయాం.. అంటూ కన్నిటి పర్యంతమైంది. వ్యక్తిగతంగా బెదిరించినా, వ్యాపారాలు నష్టపోతామని బెదిరించినా.. భరించానని శ్రావణి కంటతడిపెట్టుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌దే బాధ్యత అని ఆమె వేడుకున్నారు.

ఇసుక త‌వ్వ‌కాలు నిలిపేయాల‌ని ఆదేశించిన‌ ఎన్‌జీటీ

మానేరు వాగులో ఇసుక తవ్వాకాలకు అనుమతిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఎన్‌జీటీ తప్పుపట్టింది. వాగులో ఇసుక తవ్వకాల వలన పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతుందనీ, నీటి ఎద్దడి ఏర్పడుతుందనే ఫిర్యాదుల మేరకు.. ఎన్‌జీటీ ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఆదేశించింది.

తెలంగాణకు షాక్‌: మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ NGT ఆదేశాలు

Updated On 25 Jan 2023 5:28 PM GMT
krs

krs

Next Story