హ్యాకర్ ప్రతాపం.. వినియోగదారుల షాక్!! అమ్మ‌కానికి ధ‌ర కూడా నిర్ణ‌యం.. విధాత‌: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సాంకేతిక చౌర్యం జరిగింది. దీంతో దాదాపు 50 కోట్ల మందికి చెందిన డేటా కొందరు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు సంస్థ సాంకేతిక నిపుణులు గుర్తించారు. తమ వినియోగదారుల డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని తాము ఎక్కడా లీక్ చేయబోమని, అత్యంత భద్రంగా కాపాడుతామని చాలాసార్లు చెబుతూ వచ్చిన వాట్సాప్ లో ఇప్పుడు […]

  • హ్యాకర్ ప్రతాపం.. వినియోగదారుల షాక్!!
  • అమ్మ‌కానికి ధ‌ర కూడా నిర్ణ‌యం..

విధాత‌: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సాంకేతిక చౌర్యం జరిగింది. దీంతో దాదాపు 50 కోట్ల మందికి చెందిన డేటా కొందరు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు సంస్థ సాంకేతిక నిపుణులు గుర్తించారు. తమ వినియోగదారుల డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని తాము ఎక్కడా లీక్ చేయబోమని, అత్యంత భద్రంగా కాపాడుతామని చాలాసార్లు చెబుతూ వచ్చిన వాట్సాప్ లో ఇప్పుడు డేటా లీక్ జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు కలవరపడుతున్నారు.

ఈమేరకు ఓ హ్యాకింగ్ సంస్థ ఇలా డేటాను చోరీ చేసినట్లు ప్రకటించింది. ఎవరికి ఏ అవసరం ఉన్నా, కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటా మొత్తాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు అవాక్కయ్యారు.

లీక్ అయిన 50 కోట్ల మంది డేటాలో భారతీయులు కూడా ఉన్నారు. 32 మిలియన్ల అమెరికన్లు, 11 మిలియన్ల యూకే ప్రజలు, 10 మిలియన్ల రష్యా జాతీయులు, 35 మిలియన్ల ఇటలీ పౌరులు ఈ డేటాలో ఉన్నారు. వీళ్లతో పాటు భారతీయులు, సౌదీ అరేబియన్లు, ఈజిప్షియన్లు లక్షల సంఖ్యలో లీక్ డేటాలో ఉన్నారు. ఇలా ఎత్తుకెళ్లిన డేటాను అమ్మకానికి పెట్టిన హ్యాకర్ ఏకంగా రేట్స్ ఫిక్స్ చేసేసాడు. యూఎస్ వాట్సాప్ యూజర్ల డేటా కావాలంటే 7వేల డాలర్లు, యూకే వాట్సాప్ యూజర్ డేటా కావాలంటే 2500 డాలర్లు చెల్లించాలంటూ ధరలు నిర్ణయించారు.

ఇలా హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో వచ్చిన పోస్ట్ చూసి వాట్సాప్ ఉలిక్కిపడింది. ఆ పోస్టుపై నిజనిర్థారణ చేయడం మొదలుపెట్టింది. ఇలాంటి డేటా చోరీతో ఇతరత్రా ఏదైనా ఆర్థిక పరమైన లావాదేవీలు లేదా నేరానికి పాల్పడే ప్రమాదం ఉండొచ్చని వాట్సాప్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. ఈమేరకు ఇప్పటికే దర్యాప్తు మొదలైంది.

Updated On 26 Nov 2022 4:08 PM GMT
krs

krs

Next Story