Tuesday, January 31, 2023
More
  Homelatest50వేల ఓట్ల మోజారిటీతో గెలుస్తా.. లేకుంటే: ఉత్త‌మ్‌

  50వేల ఓట్ల మోజారిటీతో గెలుస్తా.. లేకుంటే: ఉత్త‌మ్‌

  • త‌క్కువ వ‌స్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా
  • గ‌తంలో తాను చేసిన ప‌నుల‌కే మ‌ళ్లీ కేటీఆర్ శంకుస్థాప‌న చేయ‌డం హాస్యాస్ప‌దం..

  విధాత: హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని, అందుకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

  తాజా సర్వేల ప్రకారం ఆ రెండు నియోజకవరర్గాలలో తామే(పద్మావతి-ఉత్తమ్) 50 వేల మెజారిటీతో గెలవబోతున్నామన్నారు. హుజూర్‌న‌గర్ నియోజకవర్గంలో ప్రస్తుత సర్వే మేరకు 90% ఓట్లు పోల్ అయితే కాంగ్రెస్ కు 53%, బిఆర్ఎస్ కు 29% ఓట్లు పడతాయని తేలిందన్నారు. కాంగ్రెస్ ఓట్ల శాతం మేరకు తాను 50 వేల ఓట్లతో గెలవడం ఖాయం అన్నారు.

  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ఐటి మున్సిపల్ శాఖ మాత్యులు కేటి. రామారావు ద్వారా శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలన్ని కూడా గతంలో తాను చేసినవేనని, ఆ పనులకే మళ్ళీ వాళ్లు ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

  హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నుండి రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు మార్చి 2160 ప్లాట్లకు 86 కోట్లతో పనులు మొదలుపెట్టామని, విద్యుత్, నీటి వసతి, రోడ్లకు దాదాపు 20 కోట్ల పనులకు డబ్బులు కేటాయించడం జరిగిందన్నారు. ఆ పనులు చేసే క్రమంలో రాష్ట్ర విభజన జరిగి తమ ప్రభుత్వం మారడంతో పనులను బిఆర్ఎస్ ప్రభుత్వమే నిలిపివేసిందన్నారు.

  తాను సేకరించిన ఆ భూమిలొనే ఈరోజు ఎమ్మెల్యే ఆఫీస్, బంజారా భవన్, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక కట్టారన్నారు. అక్కడ డంపింగ్ యార్డ్ పెడితే మళ్ళీ మేమే ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళితే రద్దు చేసి టెండర్లు వేసి చెత్త క్లీన్ చేశారన్నారు.

  హౌసింగ్ కాలనీకి పోయే దారి పైన బ్రిడ్జి, 80 శాతం రింగ్ రోడ్డు, హుజూర్నగర్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ రోడ్లు తాను వేయడం జరిగిందన్నారు. ఈరోజు వాళ్లు మళ్ళీ శంకుస్థాపన చేసిన ఇండ్లనైనా నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించాలని అన్నారు.

  కీతావారి గూడెం నుండి మునగాల కు వెళ్ళే రోడ్డు నిర్మాణం నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా సిఆర్ఎఫ్ మంజూరు చేయించిందేనన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ కు సంబంధించి డాక్టర్లు లేరు స్టాఫ్ లేరు పేషంట్లు లేరని, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగ పడుతుందో అనేది చూడాలన్నారు. అయితే అవుట్ సోర్సింగ్ పద్ధ‌తిలో విధుల్లో చేరే వారి వద్ద నుండి రూ.3 లక్షల పైనే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.

  540 సర్వే భూమిలో కబ్జాకు గురైన 46 ఎకరాల భూమిని వెంటనే స్వాధీన పరచుకుని కబ్జాకు కారకులైన వారి పై చర్యలు తీసుకోవాలని అలాగే మున్సిపల్ ల్యాండ్స్ విషయంలో అవకతవకలు జరిగాయని 100 కోట్ల పై చిలుకు భూములు కబ్జాలకు గురి అవుతున్నాయని మంత్రి కేటీఆర్ కు తెలియజేశాన‌ని చెప్పారు.

  ఆరు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్ దొంగలించిన విషయం పై చర్యలు తీసుకోవాలని కోరాన‌ని అన్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి ఇద్దరు మంత్రులు కూడా వారిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చార‌ని తెలిపారు.

  హుజూర్ నగర్ లో ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, కోర్టు , రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, మట్టపల్లి బ్రిడ్జ్, అన్ని గ్రామాలకు రోడ్లు, ఈరోజు కేటీఆర్ తిరిగిన రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నిర్మాణాలు నా హయాంలో మా ప్రభుత్వంలోనే జరిగాయన్నారు.

  ఈ ప్రాంతంలో అన్ని సాగునీటి లిఫ్ట్ లు నా హయాంలో నే నిర్మాణాలు జరిగాయని, వాటిని మేంటేనెన్స్ చేయలేని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మూడు వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటూ చెప్పుకోవడం విడ్డూరమన్నారు.

  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లిఫ్ట్ స్కీములను ప్రభుత్వమే నిర్వహించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు మంత్రుల పర్యటనకు తాను లేకపోతే అబద్ధాలు ప్రచారం చేసుకుంటారని ఉద్దేశంతో ఢిల్లీలో రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉన్నప్పటికీ తాను నియోజక వర్గానికి రావడం జరిగిందన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular