Telangana | తెలుగు చట్టసభల్లో మహిళా బలం డీలిమిటేషన్‌తో పెరగనున్న సీట్లు విధాత : కేంద్రం ప్రవేశపెట్టిన నారీశక్తి వందన్ 33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తే తెలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరగనున్నది. తెలంగాణలో 2026 తర్వాత అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుతూ డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాల్సి ఉంది. […]

Telangana |
- తెలుగు చట్టసభల్లో మహిళా బలం డీలిమిటేషన్‌తో పెరగనున్న సీట్లు
విధాత : కేంద్రం ప్రవేశపెట్టిన నారీశక్తి వందన్ 33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తే తెలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరగనున్నది. తెలంగాణలో 2026 తర్వాత అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుతూ డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాల్సి ఉంది.
అప్పుడు ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. తెలంగాణలో ఎస్సీ స్థానాలు 23కు, ఎస్టీ స్థానాలు 14కు పెరుగుతాయి. ఇదే లెక్క ప్రకారం ఎస్సీ స్థానాల్లో 8, ఎస్టీ స్థానాల్లో 5 మహిళలకు రిజర్వు చేయవలసి ఉంటుంది. అలాగే 116 జనరల్ స్థానాల్లో 38 స్థానాలను మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 51 స్థానాలను మహిళలకు రిజర్వు చేయవలసి ఉంటుంది.
వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించబోయే జనాభా లెక్కల తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయవలసి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో మహిళా జనాభా ఎక్కువగా ఉంది. వచ్చే జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల వారీగా మహిళా జనాభా శాతాన్ని గణించి, ముందుగా అధిక మహిళా జనాభా కలిగిన నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ నియోజకవర్గాలు 32కు, ఎస్టీ నియోజకవర్గాలు 9కి పెరుగుతాయి. ఇందులో ఎస్సీ మహిళలకు 11 స్థానాలు, ఎస్టీ మహిళలకు 3 స్థానాలు రిజర్వు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 184 నియోజకవర్గాల్లో 61 స్థానాలు మహిళకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 75 అసెంబ్లీ స్థానాలను మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో మహిళా జనాభా పురుషుల జనాభా కంటే అధికంగా ఉంది.
ప్రస్తుతం 63 నియోజకవర్గాల్లో మహిళల ఆధిక్యం
ప్రస్తుతానికి తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ స్థానాల ఖరారుకు జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుంటే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు తమ స్థానాలను మార్చుకోవలసి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో మెజార్టీ స్థానాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ స్థానాలను మహిళలకు కేటాయించాల్సి వస్తే ప్రధాన పార్టీల్లోని సీనియర్లు ఇతర నియోజకవర్గాలకు వెళ్లాల్సి వస్తుంది. మొత్తం మీద డీలిమిటేషన్, జనగణన పిదప నియోజకవర్గాలలో సాధారణ, మహిళా రిజర్వేషన్ల ఖరారు, నియోజకవర్గ వర్గాల భౌగోళిక సరిహద్ధులలో భారీ మార్పులు అనివార్యంకానున్నాయి. ఈ నేపధ్యంలో నేతలు కూడా తాము పోటీ చేసే నియోజకవర్గాలు మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడనుండటం ఆసక్తికరం.
2011 జనాభా లెక్కల మేరకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు :
1. ఆదిలాబాద్ - 114016
2. బోథ్(ఎస్టీ) - 102576
3. ఖానాపూర్(ఎస్టీ) - 104537
4. నిర్మల్ - 122696
5. ముధోల్ - 119092
6. ఆర్మూర్ - 105657
7. బోధన్ - 106222
8. బాన్సువాడ - 94941
9. నిజామాబాద్ అర్బన్ - 138615
10. నిజామాబాద్ రూరల్ - 127602
11. బాల్కొండ – 111424
12. జుక్కల్ (ఎస్సీ) – 95512
13. ఎల్లారెడ్డి - 107603
14. కామారెడ్డి - 117783
15. కోరట్ల - 116536
16. జగిత్యాల - 109853
17. ధర్మపురి(ఎస్సీ)- 107068
18. మంథని - 110840
19. పెద్దపల్లి - 120120
20. చొప్పదండి(ఎస్సీ)- 116006
21. మానకొండూర్(ఎస్సీ)- 107087
22. హుజూరాబాద్ - 119632
23. వేములవాడ - 107839
24. సిరిసిల్ల - 116066
25. ఆంధోల్(ఎస్సీ) - 114077
26. సంగారెడ్డి - 107750
27. మెదక్ - 105075
28. నర్సాపూర్ - 104712
29. హుస్నాబాద్ -114218
30. సిద్ధిపేట - 109938
31. దుబ్బాక - 95375
32. గజ్వేల్ - 126814
33. తాండూర్ - 111529
34. కొండంగల్ - 108157
35. దేవరకొండ - 107951
36. గద్వాల - 118447
37. అలంపూర్(ఎస్సీ)- 111439
38. నాగార్జున సాగర్ - 109992
39. మిర్యాలగూడ - 107265
40. నల్లగొండ - 114211
41. హుజూర్ నగర్ - 117299
42. కోదాడ - 114706
43. సూర్యపేట - 113049
44. జనగామ - 110512
45. ఘన్‌పూర్ స్టేషన్(ఎస్సీ)- 117439
46. మహబూబాబాద్(ఎస్టీ) - 119343
47. నర్సంపేట - 110271
48. వరంగల్ ఈస్ట్ - 120903
49. వర్ధన్నపేట(ఎస్సీ)- 125541
50. పరకాల - 105788
51. వరంగల్ వెస్ట్ - 134053
52. పినపాక(ఎస్టీ) - 94012
53. ఇల్లందు(ఎస్టీ) - 105638
54. కొత్తగూడెం - 117338
55. అశ్వారావుపేట(ఎస్టీ) - 76305
56. భద్రాచలం(ఎస్టీ) - 74121
57. ఖమ్మం - 159527
58. పాలేరు - 114636
59. మధిర(ఎస్సీ) - 107698
60. వైరా(ఎస్టీ) -94024
61. సత్తుపల్లి(ఎస్సీ)- 115405
62. నారాయణపేట - 107139
63. మక్తల్ - 111870.
తెలంగాణలో ఇప్పుడు మొత్తం 17 లోకసభ స్థానాలు ఉండగా, వీటిలో జనరల్ 12, ఎస్సీ 3, ఎస్టీ రెండు స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 6 లోక్‌సభ స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్సీ, నాలుగు జనరల్ స్థానాలు మహిళలకు దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 స్థానాలు రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయి. 7 జనరల్ మహిళలకు, ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్సీ మహిళలకు పోటీ చేసే అవకాశం వస్తుంది.
