కేరళ : తమ సంఘం నుంచి బయటకు వెళ్లాడనే కోపంతో అందరూ చూస్తుండగానే 59 మందికిపైగా మహిళలు దారుణానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి లక్ష్యంగా నడిరోడ్డుపై అందరూ మూకుమ్మడిగా దిడికి దిగారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి, 11 మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని త్రిస్సూర్ ఎంపరర్ ఇమ్మాన్యుయేల్ రిట్రీట్ సెంటర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షాజీ అనే వ్యక్తి ఇక్కడ ఉన్న […]

కేరళ : తమ సంఘం నుంచి బయటకు వెళ్లాడనే కోపంతో అందరూ చూస్తుండగానే 59 మందికిపైగా మహిళలు దారుణానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి లక్ష్యంగా నడిరోడ్డుపై అందరూ మూకుమ్మడిగా దిడికి దిగారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి, 11 మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని త్రిస్సూర్ ఎంపరర్ ఇమ్మాన్యుయేల్ రిట్రీట్ సెంటర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షాజీ అనే వ్యక్తి ఇక్కడ ఉన్న చర్చి సంఘంలో సభ్యుడిగా పని చేస్తుండేవాడు. ఇటీవల ఆ సంఘం నుంచి బయటకు వచ్చాడు. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ షాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా.. సుమారు 50మంది మహిళలు చుట్టుముట్టి కారు నుంచి బయటకు రాలి దాడి చేశారు.

అతని కుటుంబ సభ్యులపై సైతం దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే, ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడనే కారణంతోనే షాజీపై దాడి చేసినట్లు మహిళలు పేర్కొన్నారు. మరోవైపు సదరు మహిళపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సంఘం నుంచి బయటికి వెళ్లిన వారిపై గతంలోనూ ఇలాగే పలుమార్లు దాడులు చేసినట్లు తెలుస్తున్నది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 11 మంది మహిళలను అరెస్ట్‌ చేసినట్లు పోలీసు తెలిపారు. నిందితులపై 307, 143, 147, 144, 128 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న 11 మంది మహిళలను ఇప్పటికే రిమాండ్‌కు తరలించి వియ్యూరులోని మహిళా జైలుకు తరలించారు. కాగా, దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated On 9 Jan 2023 1:53 AM GMT
cm

cm

Next Story