Tuesday, January 31, 2023
More
  Homelatestనేను క్యాన్స‌ర్‌తో 6 నెల‌ల్లో చ‌నిపోతా.. క‌న్నీళ్లు పెటిస్తున్న హైదరాబాదీ చిన్నారి క‌థ‌

  నేను క్యాన్స‌ర్‌తో 6 నెల‌ల్లో చ‌నిపోతా.. క‌న్నీళ్లు పెటిస్తున్న హైదరాబాదీ చిన్నారి క‌థ‌

  Cancer | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆరేండ్ల వ‌య‌సులోనే క్యాన్స‌ర్‌తో పోరాడి ఓడిన ఓ చిన్నారి క‌థ ఇది. త‌న‌కు సోకింది క్యాన్స‌ర్ అని తెలిసినా.. త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌ల్లో సంతోషం చూడాల‌నుకున్న ఓ బుడ‌త‌డి తాప‌త్ర‌యం ఇది. తాను మ‌రో 6 నెల‌ల్లో చ‌నిపోతాను.. ఈ విష‌యం త‌న పేరెంట్స్‌కు చెప్పొద్దు అని అమాయ‌క‌త్వంతో డాక్ట‌ర్‌ను వేడుకున్న విషాద‌గాథ ఇది. ఈ చిన్నారి క‌థ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తుంది.

  ఆ ఆరేండ్ల చిన్నారి క‌థ‌ను హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్ న్యూరాల‌జీ డాక్ట‌ర్ సుధీర్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. డాక్ట‌ర్.. నాకు గ్రేడ్ 4 క్యాన్స‌ర్ ఉంది. కేవ‌లం మ‌రో 6 నెల‌లు మాత్ర‌మే బ‌తుకుతాను. ఈ విష‌యం మా త‌ల్లిదండ్రుల‌కు చెప్పొద్దు అని ఆ చిన్నారి డాక్ట‌ర్‌ను ప్రాథేయ‌ప‌డిన‌ట్లు రాసుకొచ్చిన ట్వీట్ థ్రెడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

  డాక్ట‌ర్ సుధీర్ కుమార్ మాటల్లోనే.. నేను ఒక‌రోజు ఓపీడీలో బిజీగా ఉన్నాను. ఇద్ద‌రు యంగ్ క‌పుల్ నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న వారి కుమారుడు మ‌ను గురించి నాకు చెప్పారు. అత‌డిని చూసి ట్రీట్‌మెంట్‌కు స‌ల‌హా ఇవ్వండి. కానీ అత‌నికి క్యాన్స‌ర్ సోకింద‌ని మాత్రం చెప్పొద్దు అని పేరెంట్స్ న‌న్ను వేడుకున్నారు. వారి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించి, మ‌నును లోప‌లికి తీసుకుర‌మ్మ‌ని చెప్పాను. వీల్ చైర్‌లో మ‌నును తీసుకొచ్చారు. మ‌నులో నాకు ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది. మ‌ను మెడిక‌ల్ రిపోర్ట్స్ ప‌రిశీలించాను. చిన్నారికి ‘గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మి’ అనే ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని గుర్తించా. కొన్ని నెలలు తప్పా.. బతకడం కష్టమే. మెదడు ఎడమవైపు ఈ క్యాన్సర్‌ రావడంతో కుడి చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. ఆ త‌ర్వాత మ‌ను పేరెంట్స్ అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాను.

  ఈ విషయాన్ని త‌ల్లిదండ్రుల‌తో చెప్పొద్దు..

  డాక్ట‌ర్‌తో నేను ఒంట‌రిగా మాట్లాడాల‌నుకుంటున్నాను. మీరు బ‌య‌ట‌కు వెళ్లండి అని మ‌ను పేరెంట్స్‌ను కోర‌డంతో వారు బ‌య‌ట‌కు వెళ్లారు. డాక్ట‌ర్.. నాకున్న డిసీజ్ గురించి ఐప్యాడ్‌లో మొత్తం చ‌దివాను. నాకు క్యాన్స‌ర్ సోకింద‌ని తెలుసు. నేను 6 నెల‌లు మాత్ర‌మే బ‌తక‌గ‌ల‌ను. ఈ విష‌యాన్ని నా త‌ల్లిదండ్రుల‌తో చెప్పొద్దు. ఈ విష‌యం తెలిస్తే వారు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతారు. న‌న్ను వారు ఎంత‌గానో ప్రేమిస్తారు. ద‌య‌చేసి ఈ విష‌యం వారితో షేర్ చేసుకోవ‌ద్దు అని ప్రాథేయ‌ప‌డ్డాడు.

  నేను షాక్ అయ్యాను..

  నేను షాక్ అయ్యాను. మాట్లాడ‌లేక‌పోయాను. మీ పేరెంట్స్‌కు చెప్ప‌న‌ని మాటిచ్చాను. మ‌నును బ‌య‌ట‌కు పంపించి, వారి త‌ల్లిదండ్రుల‌ను లోప‌లికి పిలిచాను. మ‌ను, నా మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను పేరెంట్స్‌కు చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఆ తర్వాత విషయం బాబు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లా. విషయం తెలియనట్లే ఉండాలని కోరా. ఎందుకంటే సున్నితమైన విషయాలు తల్లిదండ్రులకు తెలియాలి. అప్పుడే చివరిరోజుల్లో అయినా బాబుని సంతోషంగా ఉంచగలుగుతారు. ఇక మ‌ను త‌ల్లిదండ్రులు బోరున ఏడ్చేశారు. బ‌రువైన హృద‌యంతో ఓపీడీని వ‌దిలి వెళ్లారు.

  నెల క్రిత‌మే మ‌ను మృతి

  9 నెలలు గడిచాక ఇటీవల మళ్లీ ఆ తల్లిదండ్రులు నావద్దకు వచ్చారు. నేను వారిని గుర్తు పట్టి మను ఆరోగ్యం గురించి వాకబు చేశా. నెల క్రితమే తమను విడిచి వెళ్లిపోయాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ 8 నెలలు తాము ఉద్యోగాలకు సెలవు పెట్టి అనుక్షణం వాడితో గడిపామని ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు’ అని డాక్టర్ సుధీర్ కుమార్ వివరించారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular