Maharashtra బీడ్ జిల్లాలో అత్యధికంగా 180 మంది బలవన్మరణం ఈ వానకాలం సీజన్లో 20.7 శాతం లోటు వర్షపాతం విధాత: బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మరఠ్వాడ రీజియన్లో రికార్డు స్థాయిలో 685 మంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల బలవన్మరణాల్లో బీడ్ జిల్లాలో టాప్లో ఉన్నది. ఈ జిల్లాలో 186 మంది ఆత్మహత్యచేసుకున్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో జూలైన రెండున మంత్రి బాధ్యతలు చేపట్టిన […]

Maharashtra
- బీడ్ జిల్లాలో అత్యధికంగా 180 మంది బలవన్మరణం
- ఈ వానకాలం సీజన్లో 20.7 శాతం లోటు వర్షపాతం
విధాత: బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మరఠ్వాడ రీజియన్లో రికార్డు స్థాయిలో 685 మంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల బలవన్మరణాల్లో బీడ్ జిల్లాలో టాప్లో ఉన్నది. ఈ జిల్లాలో 186 మంది ఆత్మహత్యచేసుకున్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో జూలైన రెండున మంత్రి బాధ్యతలు చేపట్టిన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేది ఈ జిల్లాయే కావడం విశేషం.
ఎనిమిది జిల్లాల మరఠ్వాడ ప్రాంతంలోనే రైతులు అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది జవనరి నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 685 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు డివిజనల్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
వానకాలం సీజన్ మొదలైన జూన్ నుంచి ఆగస్టు మధ్య మూడు నెలల ఆ కాలంలోనే 294 మంది రైతులు చనిపోయినట్టు ఆ కార్యాలయం తెలిపింది. మరఠ్వాడ ప్రాంతంలో ప్రస్తుతం 20.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 11 వరకు సగటు వర్షపాతం 574.4 మిల్లీమీటర్ల పడాల్సి ఉండగా, 455.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణశాఖ వెల్లడించిం
