దీపావళి పండుగ వేళ గొర్రెలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో గొర్రెల ధరలు ఆకాశాన్నంటాయి. శుక్రవారం జరిగిన వేపూరు పశువుల సంతలో కేవలం నాలుగు గంటల్లోనే రూ. 6 కోట్ల విలువ చేసే గొర్రెలు అమ్ముడుపోయాయి. దీపావళి సందర్భంగా నిన్న ఒక్క రోజే 10 వేల గొర్రెలను కొనుగోలు చేసినట్లు మార్కెట్ నిర్వాహకులు తెలిపారు. వేపూరు పంచాయతీ వారాంతపు గొర్రెల మార్కెట్ ను నిర్వహిస్తోంది. ఈ మార్కెట్ కు దాదాపు 50 గ్రామాల […]

దీపావళి పండుగ వేళ గొర్రెలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో గొర్రెల ధరలు ఆకాశాన్నంటాయి. శుక్రవారం జరిగిన వేపూరు పశువుల సంతలో కేవలం నాలుగు గంటల్లోనే రూ. 6 కోట్ల విలువ చేసే గొర్రెలు అమ్ముడుపోయాయి. దీపావళి సందర్భంగా నిన్న ఒక్క రోజే 10 వేల గొర్రెలను కొనుగోలు చేసినట్లు మార్కెట్ నిర్వాహకులు తెలిపారు.

వేపూరు పంచాయతీ వారాంతపు గొర్రెల మార్కెట్ ను నిర్వహిస్తోంది. ఈ మార్కెట్ కు దాదాపు 50 గ్రామాల నుంచి రైతులు, ఇతరులు తమ గొర్రెలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో నిన్న పొద్దున్నే వేపూరు మార్కెట్.. విక్రయదారులు, కొనుగోలుదారులతో కళకళలాడిపోయింది. గొర్రెలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ట్రిచ్చి, మధురై, చెన్నై, పాండిచ్చేరి, థేనీ, నాగపట్టణం, సేలం, విల్లుపురం, కల్లకురిచి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated On 22 Oct 2022 3:09 AM GMT
subbareddy

subbareddy

Next Story