Meteorite | ఎంతో విలువైన ఒక రాయిని త‌లుపు ద‌గ్గ‌ర మెట్టుగా పెట్టుకున్నాడు ఒక వ్య‌క్తి.. ఒక‌టి కాదు రెండు ఏకంగా 80 ఏళ్లు అది అలాగే ప‌డి ఉండిపోయింది. ఏన్నో ఏళ్ల త‌ర్వాత దాని విలువ తెలుసున్న మ‌రొక‌రి వ‌చ్చి దాని గురించి చెప్ప‌డంతో ఈ విష‌యం లోకానికి తెలిసింది. ఎంతో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే ఈ ఘ‌ట‌న అమెరికా (America) లోని మిచిగ‌న్‌లో జ‌రిగింది. ఇక్క‌డ ఉన్న ఒక పొలంలో రైతు త‌న ఇంటి ముందు […]

Meteorite |

ఎంతో విలువైన ఒక రాయిని త‌లుపు ద‌గ్గ‌ర మెట్టుగా పెట్టుకున్నాడు ఒక వ్య‌క్తి.. ఒక‌టి కాదు రెండు ఏకంగా 80 ఏళ్లు అది అలాగే ప‌డి ఉండిపోయింది. ఏన్నో ఏళ్ల త‌ర్వాత దాని విలువ తెలుసున్న మ‌రొక‌రి వ‌చ్చి దాని గురించి చెప్ప‌డంతో ఈ విష‌యం లోకానికి తెలిసింది. ఎంతో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే ఈ ఘ‌ట‌న అమెరికా (America) లోని మిచిగ‌న్‌లో జ‌రిగింది.

ఇక్క‌డ ఉన్న ఒక పొలంలో రైతు త‌న ఇంటి ముందు మెట్టుగా ఒక ఉల్క రాయి (Meteorite) ని ఉంచుకున్నాడు. అయితే ఆ విష‌యం అత‌డికి తెలియ‌దు. 10 కేజీల బ‌రువుండే ఇది ఆర్థికం గానూ, శాస్త్ర ప‌రిశోధ‌న ప‌రంగానూ ఎంతో విలువైన‌ది. ఇందులో ఉండే ఖ‌నిజాన్ని లెక్క వేసుకున్నా దీని విలువ స‌రాస‌రి రూ.70 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది.

20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..

ఇలా ఉండ‌గా 2018లో సెంట్ర‌ల్ మిచిగాన్ యూనివ‌ర్సిటీకి చెందిన మోనా సిర్‌బెస్కు అనే జియాల‌జిస్టు ఒక ప‌ని మీద రైతు ఇంటికి రాగా.. అది ఆమెను విప‌రీతంగా ఆక‌ర్షించింది. దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూడ‌గానే అది ఉల్క‌లో ఒక భాగ‌మ‌ని, అది ఎంతో అరుదైన‌ద‌ని గుర్తించింది. అప్ప‌టికి గానీ దాని విలువ ఆ రైతుకు గానీ బ‌య‌టి ప్రపంచానికి గానీ తెలియ‌లేదు. ఆ రాయికి ప్ర‌స్తుతం ఎడ్మోర్ మెట‌రాయిట్ అనే పేరు పెట్టారు.

ఆ పొలానికి చెందిన రైతు డేవిడ్ మ‌జూర్క్ మాట్లాడుతూ.. తాను 1988లో ఈ పొలం కొన్నాన‌ని అప్పటి నుంచి ఈ రాయిని మెట్టు (Meteorite as a Door Step) గా వాడుతున్నాన‌ని చెప్పాడు. అంత‌కు ముందు ఆ పొలాన్ని నిర్వ‌హించిన య‌జ‌మానిని వాక‌బు చేయ‌గా.. 1930 ప్రాంతంలో ఓ ఉల్క త‌మ పొలంలో ప‌డ‌టం తాను, త‌న తండ్రి గ‌మ‌నించామ‌ని వెల్ల‌డించాడు. అది నేరుగా త‌మ పొలంలోని ఒక భ‌వ‌నంపై ప‌డటంతో త‌మ‌కు తీవ్ర న‌ష్టం కలిగింద‌ని గుర్తుచేసుకున్నాడు.

Scotland | పురాణాల్లో వ‌ర్ణించిన ఒక అరుదైన రాక్ష‌స జీవి కోసం అన్వేష‌ణ.. ఆ స‌ర‌స్సు పైనే అంద‌రి క‌ళ్లు!

ఆ త‌ర్వాత దొరికిన ఉల్క రాయిని త‌మ పొలంలోనే ఒక ప‌క్క‌న పెట్టేశామ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం ఈ భూమిని డేవిడ్ కొన‌డంతో ఈ ఉల్క కూడా అత‌డికే చెందుతుంద‌ని భావించి మిచిగాన్ యూనివ‌ర్సిటీ అత‌డికి సుమారు రూ.70 ల‌క్ష‌లు చెల్లించి ఉల్క‌ను స్వాధీనం చేసుకుంది. దానిని యూనివర్సిటీకి చెందిన‌ అబ్రామ్స్ ప్లానిటోరియంలో శాశ్వ‌తంగా ప్ర‌ద‌ర్శ‌నకు ఉంచ‌నున్నారు.

ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భ‌య‌మా..లేక సెంటిమెంటా?

Updated On 2 Sep 2023 12:51 AM GMT
krs

krs

Next Story