విమాన గోపురం. స్వర్ణ తాపడానికి చకచకా ఏర్పాట్లు విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురం బంగారు తాపడానికి 2022 సంవత్సరం ముగింపు నాటికి దాతల నుంచి 8 కిలోల బంగారం, రూ.33కోట్లు విరాళంగా అందినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కృష్ణ శిలలతో, అద్భుత శిల్పకలతో నిర్మించిన 45 అడుగుల దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125కిలోల బంగారం అవసరమని, అందుకు భక్తులు ముందుకు రావాలని 2021 అక్టోబర్ 19న సీఎం […]

విమాన గోపురం. స్వర్ణ తాపడానికి చకచకా ఏర్పాట్లు

విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురం బంగారు తాపడానికి 2022 సంవత్సరం ముగింపు నాటికి దాతల నుంచి 8 కిలోల బంగారం, రూ.33కోట్లు విరాళంగా అందినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

కృష్ణ శిలలతో, అద్భుత శిల్పకలతో నిర్మించిన 45 అడుగుల దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125కిలోల బంగారం అవసరమని, అందుకు భక్తులు ముందుకు రావాలని 2021 అక్టోబర్ 19న సీఎం కేసీఆర్ పిలుపునిచ్చి తన కుటుంబ పక్షాన కిలో బంగారం సమర్పిస్తానని ప్రకటించారు.

ఈ మేరకు ఇప్పటివరకు భక్తుల నుంచి 8 కిలోల బంగారం, రూ.33 కోట్ల విరాళాలు అందినట్లు ఈవో తెలిపారు. స్వర్ణ విమాన గోపురం రూపకల్పనకు ఇప్పటికే కసరత్తులు మొదలవ్వగా, ప్రస్తుతం రాగి తొడుగులతో కొలతలను సేకరించారు. మరో ఆరు నెలల్లో విమాన గోపురం స్వర్ణ తాపడం జరుగుతుందని భావిస్తున్నారు.

Updated On 1 Jan 2023 3:30 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story