అందుకే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు.. నివార‌ణ‌కు తీసుకోవాల్సిన ప‌దార్థాలు విధాత: మన దేశంలో నూటికి తొంబై మంది మహిళలు, బాలికల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఇది మనదేశంలో అత్యంత సాధారణమైన పోషకాహార లోపం. ఇందుకు కారణం మనలో చాలా మంది ఐరన్ ఎన్ రిచ్డ్ ఆహారం తీసుకోకపోవడం. శరీరంలో ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో చాలా నష్టం జరుగుతుంది. విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. […]

  • అందుకే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు..
  • నివార‌ణ‌కు తీసుకోవాల్సిన ప‌దార్థాలు

విధాత: మన దేశంలో నూటికి తొంబై మంది మహిళలు, బాలికల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఇది మనదేశంలో అత్యంత సాధారణమైన పోషకాహార లోపం. ఇందుకు కారణం మనలో చాలా మంది ఐరన్ ఎన్ రిచ్డ్ ఆహారం తీసుకోకపోవడం. శరీరంలో ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో చాలా నష్టం జరుగుతుంది. విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. కానీ మనలో చాలా మంది ఇవేవీ పట్టించుకోరు. ముఖ్యంగా స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించరు.

ఐరన్ జీవక్రయల నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించే పోషకం. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర ర‌క్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. ఎర్రరక్త కణాల విధి నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించే మినరల్ ఐరన్. మామూలుగా రోజువారీ శారీరక అవసరాలకు ఇది 18 ఎంజీ పరిమాణంలో ఉంటే సరిపోయే సూక్ష్మ పోషకం. అయితే శరీరం ఆహారం నుంచి ఐరన్ గ్రహించే సామర్థ్యం శరీరంలోని ఐరన్ నిల్వల మీద ఆధారపడి ఉంటుంది. కనుక ప్రతి రోజూ మన ఆహారంలో ఐరన్ కలిగి ఉండే పదార్థాలు తీసుకోవడం అవసరం. అవేమిటో తెలుసుకుందాం.

బచ్చలి కూర

అత్యంత విరివిగా దొరికే ఆకుకూర బచ్చలి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరం ఇందులోని ఐరన్‌ను త్వరగా గ్రహిస్తుంది. ఈ ఆకుకూరలో ఉండే కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారణి కూడా.

చిక్కుళ్లు

చిక్కుడు జాతి గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. చిక్కుడు జాతి గింజలు అంటే చిక్కుడు కాయలు, బీన్స్, బఠాణి, ఇతర పప్పుల వంటివని అర్థం. వీటిని లెగ్యూమ్స్ అంటారు. ఒక కప్పు వండిన గింజ‌లలో రోజువారీ అవసరమయ్యే ఐరన్‌లో 37 శాతం లభిస్తుంది.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల రుచి చాలా బావుంటింది. పోషకాలు కూడా ఎక్కువే. ఐరన్ మాత్రమే కాదు గుమ్మడి గింజల్లో విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. డయా బెటిస్, డిప్రెషన్ ను నివారిస్తుంది.

క్వినోవ

క్వినోవాలో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు గ్లుటేన్ ఉండదు కూడా. క్వినోవాను సూడో సీరియల్ అని కూడా అంటారు. గ్లుటేన్ సెన్స్టివిటి ఉన్న వారికి మంచి ఆహారం. దీనిలో ప్రోటిన్‌తో పాటు ఫోలేట్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలం.

బ్రకోలి

సలాడ్ లలో ఎక్కువ గా వాడే బ్రకోలీ మంచి ఐరన్ ఎన్ రిచ్డ్ పుడ్. ఇందులో విటమిన్ సీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల శరీరం ఐరన్ ఎక్కువ గ్రహించేందకు అవకాశం ఏర్పడుతుంది. బ్రకోలీతో పాటు, కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మంచి పోషకాహారంగా చెప్పుకోవచ్చు.

టోఫూ

టోఫూ సోయా నుంచి తయారు చేసే పన్నీర్ వంటి పదార్థం. టోఫూ థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి చాలా పోషకాలతో ఉంటుంది. దీనిలో ప్రొటీన్ కూడా చాలా ఎక్కువ.

చేపలు

చేపలు తినడం చాలా రకాలుగా ఆరోగ్యకరం. వీటిలో ఐరన్ మాత్రమే కాదు, ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు చురుకుగా ఉండేందుకు అవసరం. నిరోధక వ్యవస్థ పనితీరు కూడా బావుంటుంది. చేపలలో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది

Updated On 14 Nov 2022 5:41 PM GMT
krs

krs

Next Story