Heart Attack | విధాత: దేశంలో కొంతకాలంగా గుండెపోటు మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి పెద్ద వయసు వారి వరకు గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జిమ్‌లో 19ఏళ్ల యువకుడు వ్యాయమం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రేడ్‌మిల్‌పై వ్యాయంలో భాగంగా నడుస్తునే కార్డియాక్ అరెస్టుతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. తెలంగాణలో ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు […]

Heart Attack |

విధాత: దేశంలో కొంతకాలంగా గుండెపోటు మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి పెద్ద వయసు వారి వరకు గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు.

తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జిమ్‌లో 19ఏళ్ల యువకుడు వ్యాయమం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రేడ్‌మిల్‌పై వ్యాయంలో భాగంగా నడుస్తునే కార్డియాక్ అరెస్టుతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు.

తెలంగాణలో ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు సూత్రపు హరిచందర్ కు ఇంట్లో ఉండగానే గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే అతను మార్గమధ్యలో మృతి చెందాడు. హరిచందర్‌ చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.

Updated On 17 Sep 2023 12:32 PM GMT
somu

somu

Next Story