Tuesday, January 31, 2023
More
  Homelatestఅత్యాచార నిందితుడి త‌ల్లిపై బాలిక‌ కాల్పులు

  అత్యాచార నిందితుడి త‌ల్లిపై బాలిక‌ కాల్పులు

  Delhi | త‌న‌పై అత్యాచారం చేసిన నిందితుడి త‌ల్లిపై ఓ బాలిక తుపాకీతో కాల్పులు జ‌రిపింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని భ‌జ‌న్‌పురా ఏరియాలో శ‌నివారం సాయంత్రం 5:30 గంట‌ల‌కు చోటు చేసుకుంది.

  వివ‌రాల్లోకి వెళ్తే.. భ‌జ‌న్‌పురా ఏరియాకు చెందిన ఓ బాలిక‌(16).. 50 ఏండ్ల మ‌హిళ‌పై తుపాకీతో కాల్పులు జ‌రిపి పారిపోయింది. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్న బాధితురాలి గురించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. క్ష‌ణాల్లోనే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఇక పోలీసు బృందాలు.. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించి, కాల్పుల‌కు పాల్ప‌డ్డ బాలిక‌ను గంట‌ల వ్య‌వ‌ధిలోనే అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్ప‌డ్డ తుపాకీని కూడా సీజ్ చేశారు.

  కాల్పుల‌కు కార‌ణం ఇదేనా..?

  అయితే బాలిక‌పై 2021లో అత్యాచారం జ‌రిగింది. 25 ఏండ్ల వ‌య‌సున్న నిందితుడు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నాడు. నిందితుడి త‌ల్లిపైనే బాలిక శ‌నివారం సాయంత్రం కాల్పులు జ‌రిపింది. అయితే నిందితుడు జైల్లో ఉండ‌గా, త‌ల్లిపై ఎందుకు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఈ కాల్పుల వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. నిందితుడి త‌ల్లి స్థానికంగా కిరాణం షాపు నిర్వ‌హిస్తుంది. ఈ కాల్పుల ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular