Wednesday, December 7, 2022
More
    Homelatestనడిరోడ్డుపై చిరుత బీభత్సం.. జనాలపై దాడి (వీడియో)

    నడిరోడ్డుపై చిరుత బీభత్సం.. జనాలపై దాడి (వీడియో)

    Leopard | విధాత: చిరుత పులి పేరు వినగానే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. దాని అరుపులు విన్నామంటే సరి.. పారిపోతాం. మనషులు, ఇతర జంతువులు కనిపించాయంటే చాలు.. చిరుత దాడి చేస్తోంది. అంతటి భయంకరమైన చిరుత పులి.. ఓ గ్రామంలోని నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. జనాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

    యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

    కర్ణాటక మైసూరులోని కనకా నగర్ లోకి ఓ చిరుత పులి ప్రవేశించింది. గ్రామం మధ్యలో ఉన్న చెట్ల పొదల్లో చిరుత దాక్కుంది. చిరుతను గమనించిన స్థానికులు దాన్ని అక్కడ్నుంచి తరిమేందుకు యత్నించారు. ఈ క్రమంలో జనాలపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

    411 రోజులు కరోనాతో అల్లాడిన 59 ఏండ్ల వృద్ధుడు

    చిరుత సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. కనకా నగర్ కు చేరుకున్న అటవీశాఖ అధికారులు.. శ్రమించి చిరుతను బంధించారు. అనంతరం దాన్ని ప్రత్యేక వాహనంలో తరలించి, అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

    షేక్‌ అవుతున్న ఇంటర్నెట్.. ఈ వీడియో చూసే దమ్ముందా..?

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page