Honeymoon | తొలి రాత్రి ఓ తీపి గుర్తుగా ఉండి పోవాలని నూతన దంపతులు కోరుకుంటారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఇక తొలి రాత్రి పూర్తయిన వెంటనే కొంత మంది దంపతులు హనీమూన్‌కు వెళ్తుంటారు. కొందరైతే ఇంటికే పరిమితం అవుతారు.
అయితే ఓ యువకుడు మాత్రం తొలి రాత్రికి దూరంగా ఉన్నాడు. తొలి రాత్రి జరిగి, భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిలిబిత్‌కు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లైన తర్వాత అతను తొలి రాత్రికి దూరంగా ఉన్నాడు. ఆ మరుసటి రోజు కూడా భార్యను దగ్గరకు రానివ్వలేదు. ఈ విషయం అత్తింటి వారికి తెలిసింది. దీంతో వారు ప్రశ్నించగా, తనకు రూ. 10 లక్షలు ఇస్తేనే హనీమూన్‌కు తీసుకెళ్తానని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక రూ. 5 లక్షలు సమకూర్చారు.
ఆ డబ్బుతో ఈ నెల 7వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు హనీమూన్‌కు వెళ్లారు. అక్కడ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. నగ్నంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించాడు. మరో రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు.. 13వ తేదీన తన పుట్టింటికి వెళ్లిపోయింది. బాధితురాలు తన అత్త, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.