వరంగల్ పోలీసులకు పెద్ద టెస్ట్ టాక్సీకాలేజీ రిపోర్టుపై అంచనాలు తారుమారు సీపీ రంగనాథ్ చేతికి చేరిన రిపోర్ట్ డీజీపీని కలవనున్న సిపి ప్రీతి బాడీలో విష పదార్థాలు లేవని రిపోర్ట్? ముగిసిన డాక్టర్ సైఫ్ కస్టడీ, విచారణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి కేసు (Dr. Preeti Case) లో దిమ్మదిరిగే ట్విస్ట్(Twist) చోటుచేసుకుంది. ఇన్ని రోజులు.. సీనియర్ల వేధింపులు భరించలేక ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని […]

  • వరంగల్ పోలీసులకు పెద్ద టెస్ట్
  • టాక్సీకాలేజీ రిపోర్టుపై అంచనాలు తారుమారు
  • సీపీ రంగనాథ్ చేతికి చేరిన రిపోర్ట్
  • డీజీపీని కలవనున్న సిపి
  • ప్రీతి బాడీలో విష పదార్థాలు లేవని రిపోర్ట్?
  • ముగిసిన డాక్టర్ సైఫ్ కస్టడీ, విచారణ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి కేసు (Dr. Preeti Case) లో దిమ్మదిరిగే ట్విస్ట్(Twist) చోటుచేసుకుంది. ఇన్ని రోజులు.. సీనియర్ల వేధింపులు భరించలేక ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది అనుకుంటే.. ఇప్పుడు వచ్చిన "టాక్సికాలజీ (Toxicology)" రిపోర్టు(Report) సీన్ మొత్తాన్ని రివర్స్ చేసి పారేసింది. టాక్సికాలజీ రిపోర్టు ఇప్పుడు ఈ కేసును మరో కొత్త మలుపు తిప్పబోతోంది. ఈ రిపోర్టు ఇప్పటికే వరంగల్ సీపీ రంగనాథ్(CP Ranganath) చేతికి అందగా.. ఆయన ఈ రోజు హైదరాబాద్‌లోని పోలీసు బాస్ దగ్గరికి వెళ్తున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ముగిసిన డాక్టర్ సైఫ్ కస్టడీ, విచారణ

మెడికో ప్రీతి (Dr. Preeti) కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులకు ప్రీతి కేసు సవాల్‌గా మారింది. ఇప్పటికే.. నిందితుడు సైఫ్‌(Saif)ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులతో పాటు.. అటు మిగతా జూనియర్ డాక్టర్లను కూడా యాంటీ ర్యాంగిగ్ కమిటీ విచారిస్తోంది. ఖమ్మం జైలు నుంచి డాక్టర్ సైఫ్ ను గురువారం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజులుగా మట్టేవాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసిన విచారణ ముగిసింది.

ఈ సందర్భంగా డాక్టర్ సైఫ్ నుంచి మరోసారి వివరాలు రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. సైఫ్ అందించిన వివరాల మేరకు ఇతర ఆధారాలు, పరిస్థితిని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ప్రీతి, సైఫ్.. మొబైల్స్‌లోని చాటింగ్‌లతో పాటు జూనియర్ డాక్టర్ల ఫోన్లలోని సాంకేతిక ఆధారాలను కూడా సేకరించి.. లోతుగా విశ్లేషిస్తున్నారు.

ప్రీతి బాడీలో ఎలాంటి విష పదార్థాలు లేవా?

అయితే.. ఈ కేసులో వచ్చిన టాక్సికాలజీ(Toxicology) రిపోర్టు ఇప్పుడు దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇన్ని రోజులు.. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిందని అంతా అనుకుంటే.. ఇప్పుడు వచ్చిన‌ టాక్సికాలజీ రిపోర్టు సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేసింది. ప్రీతి బాడీలో ఎలాంటి విష(poison) పదార్థాలు కానీ, రసాయనాలు(Chemicals) గానీ లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాలను పరిశీలించిన వైద్యులకు.. ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడించారు.

సీపీ చేతికి టాక్సికాలేజీ నివేదిక

టాక్సీ కాలేజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ ((CP Ranganath)) చేతికి చేరింది. దీంతో.. ఇన్ని రోజులు ఆత్మహత్యాయత్నం కేసుగా పరిగణించిన కేసును.. ఇప్పుడు అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలంగాణ డీజీపీ(Telangana DGP) నుంచి సీపీకి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ కేసు గురించి వివరించేందుకు సీపీ నేరుగా హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. మరోవైపు.. నిందితుడు సైఫ్ హోం మంత్రికి సమీప బంధువు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.

పోలీసులకిప్పుడు పెద్ద టెస్ట్

ప్రీతి మృతి.. అసలు హత్యా.. ఆత్మహత్యా.. అన్న విషయం ఎటూ తేల్చుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ముందు నుంచి ప్రీతిది హత్యే అంటూ ఆమె కుటుంబసభ్యులు మాత్రం వాదిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి.. పలు అనుమానాలను కూడా ప్రీతి తండ్రి మీడియా ముందు వ్యక్తం చేశారు. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చుకుని ఉంటే.. శరీరంపై ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదంటూ ఎంజీఎంలో అనుమానం వ్యక్తం చేశారు. ముందు నుంచి వాళ్లు ఆరోపిస్తున్నట్టుగానే.. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు దొరకపోవటం పెద్ద ట్విస్టే.

సంక్లిష్టంగా మారిన కేసు విచారణ

ప్రీతి మృతి సంఘటన కేసులో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని సర్వత్రా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఈ కేసు తీవ్ర సంక్లిష్టంగా మారింది. ఒకవైపు రాజకీయ ఒత్తిడి మరోవైపు డాక్టర్ ప్రీతి మృతి నేపథ్యంలో లభిస్తున్న ఆధారాలు అంచనాలకు భిన్నంగా ఉండడంతో పోలీసులు ఏ దిశగా ఈ కేసు విచారణ కొనసాగిస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ కేసులో తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న అమాయకులు బలైపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చర్చ సాగుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుందని సాధారణ సూత్రం మేరకు శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి సాగే దర్యాప్తు కొంత ఆలస్యంగా నైనా వాస్తవ ఫలితాలను తెలుగులోకి తెచ్చే అవకాశాలు ఉంటాయని మరో వాదన వినిపిస్తుంది. మరి పోలీసులు ప్రభుత్వం తాజాగా నెలకున్న ఒత్తిడి నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

Updated On 6 March 2023 6:33 AM GMT
Somu

Somu

Next Story