US విధాత: విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అమెరికా (America) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం షికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లాస్ ఏంజెలెస్ వెళుతున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9 గంటలకు టేకాఫ్‌కు రన్‌వేపై సిద్ధమవుతుండగా ముందుగా తన సీట్లోంచి లేచిన ఆ వ్యక్తి విమానం తలుపు తీయడానికి తర్వాత ఎమర్జెన్సీ డోర్ తీయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో నేరుగా కాక్‌పిట్‌లోకి చొరబడటానికి […]

US
విధాత: విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అమెరికా (America) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం షికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లాస్ ఏంజెలెస్ వెళుతున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉదయం 9 గంటలకు టేకాఫ్‌కు రన్‌వేపై సిద్ధమవుతుండగా ముందుగా తన సీట్లోంచి లేచిన ఆ వ్యక్తి విమానం తలుపు తీయడానికి తర్వాత ఎమర్జెన్సీ డోర్ తీయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో నేరుగా కాక్‌పిట్‌లోకి చొరబడటానికి యత్నించాడు.
దీంతో టేకాఫ్‌ను విరమించుకున్న విమాన సిబ్బంది మళ్లీ విమానాన్ని రన్ వేనుంచి తప్పించి గేట్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అరెస్టు చేశారు.
సెప్టెంబరు 11 దాడులు పూర్తయి 22 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. భద్రతా దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. నిందితుడి వివరాలను చెప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
