HomelatestPlane Door | ఆకాశంలో విమానం.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచిన ప్రయాణికుడు

Plane Door | ఆకాశంలో విమానం.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచిన ప్రయాణికుడు

Plane Door |

విధాత: బస్సులో వెళ్లేటప్పుడు గ్లాస్‌ డోర్‌ తెరిస్తే.. వచ్చే గాలి మనసుకు హాయినిస్తుంది. మరి.. అదే గాల్లో ఎగురుతున్న విమానంలో చేస్తే? ఊహించడానికే భయమేస్తున్నది కదా! దక్షిణ కొరియాలో ఒక వ్యక్తం చేసిన ఈ పిచ్చి పని.. విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలను అరచేత పట్టుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది.

అయితే.. ల్యాండింగ్‌కు కొద్ది సేపటి ముందు ఆ ఘటన జరగడంతో అంతా ప్రాణాలతో ‘భయ’ట పడ్డారు. ఇంతకీ ఆ విమానంలో ఎంత మంది ఉన్నారనుకుంటున్నారు? ఏకంగా 194 మంది. ఆ సమయంలో ఒక ప్రయాణికుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది.

భయపడిన ప్రయాణికుల అరుపులు కేకలతో విమానం మారుమోగిపోయింది. ల్యాండింగ్‌కు ముందు అంతా సీట్‌బెల్ట్‌లు పెట్టుకుని ఉండటంతో ప్రమాదాలు తప్పాయి. ఆసియానా ఎయిర్‌లైన్స్‌ విమానం మరికొద్ది సేపటిలో దక్షిణ కొరియాలోని దాయిగు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో ఒక వ్యక్తి విమానం దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తున ఉన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేశాడు.

దీంతో లోపలికి గాలి దూసుకువచ్చి.. ప్రయాణికులను కంగారెత్తించింది. వేగంగా వస్తున్న గాలితో కొంతమందికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై.. స్వల్ప అస్వస్థతకు గుయ్యారు. వారందరినీ అధికారులు హాస్పిటల్స్‌కు పంపించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular