Snake Dies | పాములను చూస్తేనే పిల్లలు పరుగెడుతారు. గట్టిగా ఏడ్చేస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం పాముకు బెదరలేదు. ఏకంగా పామునే కొరికి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మద్నాపూర్ గ్రామానికి చెందిన దినేశ్ సింగ్ తన 3 ఏండ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, అటువైపు ఓ పాము వచ్చింది. […]

Snake Dies | పాములను చూస్తేనే పిల్లలు పరుగెడుతారు. గట్టిగా ఏడ్చేస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం పాముకు బెదరలేదు. ఏకంగా పామునే కొరికి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మద్నాపూర్ గ్రామానికి చెందిన దినేశ్ సింగ్ తన 3 ఏండ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, అటువైపు ఓ పాము వచ్చింది. ఇక ఏ మాత్రం బెదరకుండా బాలుడు పాము దగ్గరికి వెళ్లాడు. పామును తన చేతితో పట్టుకుని, నోటితో కొరికేశాడు. ఆ తర్వాత బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు.
బుడ్డోడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాలుడికి వైద్యం అందించారు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుడ్డోడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
