Viral Video | విధాత: పాములు ప‌గ‌బ‌డుతాయా? అంటే ఈ ప్ర‌శ్న‌కు ఇంత వ‌ర‌కు స‌మాధానం దొర‌క‌లేదు. ప‌గ‌ బ‌డుతాయ‌నే దానికి ఇంత వ‌ర‌కు ఆధారాలు ల‌భించ‌లేదు. ఎవ‌రికి వారు ఊహించుకోవ‌డ‌మే త‌ప్పా ఇంత వ‌ర‌కు నిర్ధారించ‌బ‌డ‌ లేదు. మ‌రి పాములు దొంగ‌త‌నం చేస్తాయా? ఈ ప్ర‌శ్న కొత్త‌గా అనిపిస్తుంది క‌దా..! కానీ ఈ వీడియో చూస్తూ పై రెండు ప్ర‌శ్న‌ల‌కు సగం స‌మాధానం దొరికిన‌ట్టే అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇండ్ల మధ్యకు వ‌చ్చిన ఓ పామును చూసి […]

Viral Video | విధాత: పాములు ప‌గ‌బ‌డుతాయా? అంటే ఈ ప్ర‌శ్న‌కు ఇంత వ‌ర‌కు స‌మాధానం దొర‌క‌లేదు. ప‌గ‌ బ‌డుతాయ‌నే దానికి ఇంత వ‌ర‌కు ఆధారాలు ల‌భించ‌లేదు. ఎవ‌రికి వారు ఊహించుకోవ‌డ‌మే త‌ప్పా ఇంత వ‌ర‌కు నిర్ధారించ‌బ‌డ‌ లేదు. మ‌రి పాములు దొంగ‌త‌నం చేస్తాయా? ఈ ప్ర‌శ్న కొత్త‌గా అనిపిస్తుంది క‌దా..! కానీ ఈ వీడియో చూస్తూ పై రెండు ప్ర‌శ్న‌ల‌కు సగం స‌మాధానం దొరికిన‌ట్టే అనిపిస్తుంది.

ఉన్నట్టుండి ఇండ్ల మధ్యకు వ‌చ్చిన ఓ పామును చూసి స్థానికులు గ‌ట్టిగా అరిచారు. ఆ అరుపుల‌కు పాము కొంచెం బెదిరింది. దాన్ని వెళ్ల‌గొట్టేందుకు స్థానికులు య‌త్నించారు. అయితే అక్క‌డ ఓ పింక్ క‌ల‌ర్ చెప్పు ఉండ‌గా, దాన్ని నోటితో ప‌ట్టుకొని పాము వేగంగా వెళ్లిపోయింది. కొంచెం దూరంలో ఉన్న రాళ్ల గోడ‌లోకి పాము దూరిపోయింది. దీన్ని చూసి స్థానికులు న‌వ్వుకున్నారు. అయితే ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

చాలామంది ఈ వీడియోను చూసి పలు రకాలుగా స్పందిస్తున్నారు. అది ఓ వ్యక్తిని పగ బట్టి అతన్ని వెతుక్కుంటూ వచ్చిందని, అతను కనిపించకపోయే సరికి అతని చెప్పును తీసుకెళ్లిందని కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది పాము దారి తప్పి వచ్చి తినేదనుకుని నోట కరుచుకుని వెళ్లిందని అంటున్నారు.

Updated On 2 March 2023 2:14 AM GMT
subbareddy

subbareddy

Next Story