ప్రియురాలికి వీడియో కాల్.. తండ్రి తల పగులగొట్టిన కుమారుడు
తన వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తండ్రి పట్ల కుమారుడు క్రూరంగా ప్రవర్తించాడు. తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ఆమె చూస్తుండగానే తండ్రి తల పగులగొట్టాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు నగరానికి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు కుమారుడు భరత్(21) హమాలీగా పని చేస్తున్నాడు. అయితే 39 ఏండ్ల మహిళతో భరత్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర […]

తన వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తండ్రి పట్ల కుమారుడు క్రూరంగా ప్రవర్తించాడు. తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ఆమె చూస్తుండగానే తండ్రి తల పగులగొట్టాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు నగరానికి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు కుమారుడు భరత్(21) హమాలీగా పని చేస్తున్నాడు. అయితే 39 ఏండ్ల మహిళతో భరత్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలియడంతో కుమారుడిని తండ్రి తీవ్రంగా మందలించాడు. తన మాట వినకపోవడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. భరత్‌ను పోలీసులు పిలిపించి మందలించి పంపారు.
దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న భరత్.. తన ప్రియురాలికి ఫోన్ చేసి తన తండ్రిపై దాడి చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసి.. ఆమె చూస్తుండగానే తండ్రి తల పగులగొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాబును స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
