Wednesday, March 29, 2023
More
    HomelatestAdani Group | అదానీకి షాక్ ఇచ్చిన ‘సుప్రీం’..! మీడియా రిపోర్టింగ్‌ నియంత్రణకు నిరాకరణ

    Adani Group | అదానీకి షాక్ ఇచ్చిన ‘సుప్రీం’..! మీడియా రిపోర్టింగ్‌ నియంత్రణకు నిరాకరణ

    Adani Group | పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. మీడియా రిపోర్టింగ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. నిషేధం విధించేందుకు నిరాకరించింది. అదానీ-హిండెన్‌బర్గ్‌ కేసుపై కోర్టు తుది ఉత్తర్వులు వెలువడే వరకు మీడియా రిపోర్టింగ్‌ చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కట్టివేసింది. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జేబీ పార్దివాల ధర్మాసనం పిటిషన్‌ విచారించింది. ‘మేం మీడియాకు ఎలాంటి నిషేదాజ్ఞలు జారీ చేయబోవడం లేదు. తర్వలోనే ఉత్తర్వులు ప్రకటిస్తాం’ అని స్పష్టం చేసింది.

    ఇదిలా ఉండగా.. ఈ నెల 17న స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ చర్యలను బలోపేతం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల ప్యానెల్‌పై కేంద్రం చేసిన సూచనను సీల్డ్‌ కవర్‌లో తీసుకునేందుకు కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలనుకుంటున్నందున సీల్డ్‌ కవర్‌ సూచనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం తేల్చిచెప్పింది. అదానీ గ్రూప్ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో పతనమవుతున్న నేపథ్యంలో భారత పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రెగ్యులేటరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో డొమైన్ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఈ నెల 10న సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.

    హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్స్‌ వ్యవహారంపై విచారణ జరుపాలంటూ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సామాజిక కార్యకర్త ముఖేష్ కుమార్ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అమెరికాకు చెందిన రీసెర్చ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ అదానీ గ్రూప్స్‌ మోసపూరిత లావాదేవీలు, షేర్ల ధరలను తారుమారు చేస్తు్న్నట్లుగా ఆరోపించింది. దాంతో స్టాక్‌ మార్కెట్లలో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ ఖండించింది. అన్ని చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular