Satyendra Jain | విధాత: ఏ ఒక్క‌రూ కూడా జైలు జీవితం అనుభవించాల‌ని కోరుకోరు. ఎందుకంటే ఆ జీవితం అంత దుర్భ‌రంగా ఉంటుంది. కానీ నేరం చేసిన సంద‌ర్భంలో త‌ప్ప‌నిస‌రిగా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దు. సాధార‌ణ జీవితంలో ఎంతో ఉన్న‌తంగా బ‌తికిన వారు కూడా జైలుకు వెళ్లిన త‌ర్వాత అన్నింటిని కోల్పోవాల్సిందే. అలాంటిది జైలు జీవితం. అందుకే రాజ‌కీయ నాయ‌కులు జైలు పాలైన‌ప్పుడు.. వారికి స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించాల‌ని వారి మ‌ద్ద‌తుదారులు కోర్టుల్లో పిటిష‌న్ దాఖ‌లు చేస్తుంటారు. […]

Satyendra Jain | విధాత: ఏ ఒక్క‌రూ కూడా జైలు జీవితం అనుభవించాల‌ని కోరుకోరు. ఎందుకంటే ఆ జీవితం అంత దుర్భ‌రంగా ఉంటుంది. కానీ నేరం చేసిన సంద‌ర్భంలో త‌ప్ప‌నిస‌రిగా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దు. సాధార‌ణ జీవితంలో ఎంతో ఉన్న‌తంగా బ‌తికిన వారు కూడా జైలుకు వెళ్లిన త‌ర్వాత అన్నింటిని కోల్పోవాల్సిందే. అలాంటిది జైలు జీవితం.

అందుకే రాజ‌కీయ నాయ‌కులు జైలు పాలైన‌ప్పుడు.. వారికి స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించాల‌ని వారి మ‌ద్ద‌తుదారులు కోర్టుల్లో పిటిష‌న్ దాఖ‌లు చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. వీఐపీ సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు.

అయితే ఆప్ మంత్రి స‌త్యేంద్ర జైన్‌కు వీఐపీ సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌కున్నా.. ఆయ‌న‌కు స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించారు. రుచిక‌ర‌మైన భోజ‌నం, మిన‌ర‌ల్ వాట‌ర్ నుంచి మొద‌లుకుంటే.. మ‌సాజ్ వ‌ర‌కు అన్ని క‌ల్పించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీ మంత్రిగా కొన‌సాగుతున్న స‌త్యేంద్ర జైన్.. మ‌నీలాండ‌రింగ్ కేసులు అరెస్టు అయి జైలు పాల‌య్యారు. ఇదిలాఉండగా జైన్‌కు తీహార్ జైల్లో వీఐపీ సౌక‌ర్యాలు అందుతున్నాయ‌ని వార్త‌లు రావ‌డంతో.. జైలు సూప‌రింటెండెంట్ అజిత్ కుమార్ ఇటీవ‌లే స‌స్పెండ్ అయ్యారు. ఆయ‌న స‌స్పెండ్ అయిన రెండు, మూడు రోజుల‌కే జైన్ మసాజ్ వీడియోలు విడుద‌ల కావ‌డం విశేషం.

తీహార్ జైల్లో స‌త్యేంద్ర జైన్ ఉంటున్న గ‌దిలో వీఐసీ సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్ కూడా క‌నిపించాయి. ఇక జైన్ ఏవో పేప‌ర్లు చ‌దువుతుండ‌గా ఓ వ్య‌క్తి అత‌న్ని కాళ్లు ఒత్తిన వీడియోలు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాకుండా జైన్ త‌ల‌కు మ‌సాజ్ చేయించుకున్న‌ వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫుటేజీలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆప్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ మ‌సాజ్‌లు సెప్టెంబ‌ర్ నెల‌లో చేయించుకున్న‌ట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.

అయితే మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని 2017, ఆగ‌స్టు 24వ తేదీన జైన్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. అప్ప‌ట్నుంచి ఈడీ విచార‌ణ మొద‌లు పెట్టింది. మే 30వ తేదీన ఆయ‌న‌ను అరెస్టు చేసి తీహార్ జైలుకు త‌ర‌లించింది. ఈ కేసులో కోర్టు ఇప్ప‌టికే రెండు సార్లు బెయిల్ నిరాక‌రించింది.

Updated On 19 Nov 2022 5:16 PM GMT
subbareddy

subbareddy

Next Story