Abhiram | ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. చాలా మంది సెలబ్స్ తమ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెబుతూ ఒకింటి వారవుతున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. అభిరామ్ అంటే వెంటనే మనకు శ్రీరెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. శ్రీరెడ్డితో మనోడు నడిపిన యవ్వారం టాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్ అయింది. ఇలా ఇండస్ట్రీలోకి రాక ముందే.. వివాదాలతో […]

Abhiram |
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. చాలా మంది సెలబ్స్ తమ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెబుతూ ఒకింటి వారవుతున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. అభిరామ్ అంటే వెంటనే మనకు శ్రీరెడ్డి పేరు గుర్తుకు వస్తుంది.
శ్రీరెడ్డితో మనోడు నడిపిన యవ్వారం టాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్ అయింది. ఇలా ఇండస్ట్రీలోకి రాక ముందే.. వివాదాలతో ఫేమస్ అయ్యారు అభిరామ్. ఇప్పుడిప్పుడే వాటి నుండి దూరంగా ఉంటూ.. వైవిధ్య మైన సినిమాలతో ఆ మరకలని తుడిచేయాలని చూస్తున్నాడు అభిరామ్.
ఇటీవల తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని దారుణంగా నిరాశపరచింది. తొలి సినిమానే భారీ ఫ్లాప్‌గా నిలవడంతో ఇప్పుడు మంచి కథలపై దృష్టి సారిస్తున్నాడు. మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
అయితే తాజాగా అభిరామ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అభిరామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ప్పటికీ, ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం దగ్గుపాటి రామానాయుడు కోరిక మేరకు తన తమ్ముడి మనవరాలు అంటే సురేష్ బాబు చెల్లెలి కూతురిని అభిరామ్ పెళ్లి చేసుకో బోతున్నాడని టాక్.
అభిరామ్ కు ఆ అమ్మాయి వరుసకు మరదలు కావడంతో ఆమెతో అభిరామ్ వివాహం జరిపించాలని అనుకుంటున్నారట. చిన్నప్పటి నుండి వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడం వల్ల పెద్దలు కూడా వారి వివాహం జరిపించాలని అనుకుంటున్నారట. డిసెంబర్ 6న అభిరామ్ పెళ్లి గ్రాండ్ గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.
రానా పెళ్లి కరోనా వలన చాలా సింపుల్‌గా జరగగా, అభిరామ్ పెళ్లిని మాత్రం పెద్ద ఎత్తున జరిపించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.పెళ్లి తర్వాత అభిరామ్ కు కెరీర్ పరంగా కూడా ఎంతగానో కలిసి వస్తుందని దగ్గుబాటి అభిమానులు అనుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో అభిరామ్ ఒక సినిమా చేస్తే పక్కా హిట్ అందుకోవడం ఖాయంగా చెబుతున్నారు.
