విధాత: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌ విచారణను కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను ఎత్తి వేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ […]

విధాత: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌ విచారణను కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను ఎత్తి వేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది.

Updated On 21 Nov 2022 8:46 AM GMT
krs

krs

Next Story