విధాత‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు కోరారు. గత నెల 28న ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని సిట్‌ అధికారులు విచారించారు. రెండు రోజుల్లో వారి నుంచి కొంత సమాచారాన్ని […]

విధాత‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు కోరారు. గత నెల 28న ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

ఈ నెల 10, 11 తేదీల్లో ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని సిట్‌ అధికారులు విచారించారు. రెండు రోజుల్లో వారి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. అయితే ఈ వివరాలు సరిపోవని దర్యాప్తులో భాగంగా ఈ కేసులో మరిన్ని విషయాలు ముగ్గురు నిందితుల నుంచి తెలుసుకోవాల్సి ఉన్నందున మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కోరింది.

ముఖ్యంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణంలో విచారిస్తున్నారు. నిందితుల సెల్‌ఫోన్లు, లాప్‌టాప్ లు ఎస్‌ఎఫ్‌ఎల్‌కు పంపించారు. ఇందులో కొంత డాటా బైటికి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను ప్రశ్నించాల్సి ఉన్నదని అందుకే కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట వాదించారు.

నిందితుల తరఫున న్యాయవాది వాదిస్తూ ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. వారిని పూర్తి స్థాయిలో విచారించారు. అలాగే ఇందులో పెట్టిన సెక్షన్లే తప్పని వాదించారు. రాజకీయ కారణాలతోనే నిందితులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.

వీళ్లు దాదాపు 25 రోజులుగా రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.కాబట్టి వారిని కస్టడీకి మరోసారి అనుమతించొద్దని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు. అయితే నిందితుల తరఫున న్యాయవాది వాదనతో ఏకీభవించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది

Updated On 24 Nov 2022 1:01 PM GMT
krs

krs

Next Story