Wednesday, March 29, 2023
More
    Homeక్రైమ్‌సూర్యాపేట: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్.. రూ.13.5 లక్షల ఆభరణాలు స్వాధీనం

    సూర్యాపేట: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్.. రూ.13.5 లక్షల ఆభరణాలు స్వాధీనం

    విధాత: తాళం పెట్టిన నివాసాలనే టార్గెట్ చేసి తాళం పగలగొట్టి దొంగతనాలు చేయడంలో సిద్ధ హస్తుడైన నిందితుడు వాంకుడోతు నాగరాజును సూర్యాపేట పోలీసులు అరెస్టు చేసి అతడి నుండి రూ.13.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS మీడియాకు వెల్లడించారు.

    తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌..

    జిల్లాలోని చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాకు చెందిన‌ వాంకుడోతు నాగరాజు మండల పరిధిలో పగటి సమయంలో బయటి నుంచి ఇంటికి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం పనిగా పెట్టుకున్నాడు. ఆ సమయంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లలోకి దూరి తనతో తెచ్చుకున్న కట్టింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి వెళ్ళి ఇళ్లలో ఉన్న బంగారం, వెండి ఆభరాణాలతో పాటు దొరికినంత డబ్బును దొంగిలించుకొని వెళ్లి పోతున్నాడని తెలిపారు.

    పోలీసుల త‌నిఖీలో ప‌ట్టుబ‌డిన నాగ‌రాజు..

    గ‌తంలో నేరస్థుడు చిన్న, చిన్న దొంగతనాలకు పాల్పడేవాడని, శుక్రవారం ఉదయం చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామ Indian oil పెట్రోల్ బంకు వద్ద చింతలపాలెం ఎస్‌ఐ వారి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండ‌గా చింతలపాలెం వైపు నుండి జగ్గయ్యపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న పోలీసుల‌ని చూసి తడబడుతూ అనుమానాస్పదంగా పారిపోవ‌డానికి ప్రయత్నం చేయగా స‌ద‌రు వ్యక్తి ని పట్టుకుని విచార‌ణ చేప‌ట్టారు. తన పేరు వాంకుడోతు నాగరాజుగా గుర్తించారు.

    దోచిన ఆభ‌ర‌ణాలను జ‌గ్గ‌య్య‌పేట‌లో అమ్మేందుకు వెళ్తూ..

    నాగరాజు చింతలపాలెం మండల పరిధిలోని చింతలపాలెం, దొండపాడు, తమ్మారం, ఎర్రకుంట తండ, నక్కగూడెం గ్రామాలలోని ఇళ్ళలో దొంగ‌త‌నం చేసిన బంగారు, వెండి ఆభరణాలను కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో అమ్ముకొని వద్దామని జగ్గయ్యపేటకు వెళ్తుండగా దొండపాడు వద్ద పోలీసు తనీఖీల్లో దొరికిపోయాడని తెలిపారు. అతడి నుండి మొత్తం బంగారం 23.2 తులాలు, వెండి బరువు 63 గ్రాములు స్వాధీనం చేసుకున్నమన్నారు. వాటి విలువ 13.50 లక్షలు ఉంటుంద‌న్నారు.

    నాగ‌రాజుపై 7 చోరీ కేసులు న‌మోదు..

    నాగరాజు పై చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏడు చోరీ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
    ఈ కేసు డిటెక్ట్ చేయడంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసిన కోదాడ డీఎస్పీ జి.వెంకటేశ్వర్ రెడ్డి, ప్రత్యేక దృష్టి పెట్టిన కోదాడ రూరల్ సి.ఐ పి‌.ఎన్‌.డి ప్రసాద్, చింతలపాలెం ఎస్‌ఐ యం.కృష్ణా రెడ్డి, హెచ్.సి లు A. లక్ష్మయ్య, వెంకటేశర్లు, పి.సి. నాగరమేష్, ఎం. రామరావు (డి‌.ఎస్‌.పి ఆఫీసు) హెచ్.జి.లు రవి, లచ్చయ్య లను ఎస్పీ అభినందించారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular