Satish Kaushik | భారతీయ సినిమా పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ (66) గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ సతీశ్ కౌశిక్‌కు ఆయన నివాళులర్పించారు. ‘మరణమే ఈ ప్రపంచంలోని పరమ సత్యం!’ కానీ, బతికున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ సతీశ్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహానికి సడన్ ఫుల్ స్టాప్! ఓం శాంతి!’ అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సతీశ్ కౌశిక్ ఢిల్లీలోని విద్యనభ్యసించారు. కిరోరి మాల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో అడ్మిషన్ తీసుకున్నారు. 1983లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 1985లో ఆమె శశి కౌశిక్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన తనయుడు రెండేళ్ల వయసులో మృతి చెందాడు.
సతీశ్ కౌశిక్ కెరీర్ ఇలా..
1983లో వచ్చిన ‘మాసూమ్’ సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించాడు. సినిమా నటుడిగా సతీశ్ కౌశిక్ 1987 చిత్రం మిస్టర్ ఇండియా నుంచి గుర్తింపు పొందారు. అతను 1997లో దీవానా మస్తానాలో పప్పు పేజర్ పాత్రను పోషించాడు. కెరీర్‌లో ఆయన సుమారు 100 చిత్రాల్లో పనిచేశాడు. 1990లో ‘రామ్ లఖన్’.. 1997లో ‘సాజన్ చలే ససురాల్’ కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ హాస్యనటుడు) గెలుపొందాడు. ఆయన దర్శకుడిగా తొలి చిత్రం ‘రూప్‌కీ రాణి చోరోన్ కా రాజా’ (1993)తో దర్శకుడిగా పరిచమయ్యాడు. ఇందులో శ్రీదేవి ప్రధానపాత్ర పోషించారు. 1999లో విడుదలైన ‘హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై’, 2005లో అర్జున్ రాంపాల్, అమీషా పటేల్, జాయెద్ ఖాన్ నటించిన ‘వాద’ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహించాడు. 2007లో కౌశిక్ అనుపమ్ ఖేర్‌తో కలిసి కరోల్ బాగ్ ప్రొడక్షన్స్ అనే కొత్త సినిమా కంపెనీని ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో అతని మొదటి చిత్రం తేరే సాంగ్.