Satinder Kumar Khosla ముంబైలో గుండెపోటుతో తుదిశ్వాస బీర్బల్‌గా బాలీబడ్‌ ఇండస్ట్రీలో ఖ్యాతి వివిధ భాషల్లో 500 చిత్రాల్లో నటన సినీ ప్రముఖుల సంతాపం విధాత: బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొన్నది. సీనియర్‌ నటుడు, షోలే ఫేమ్‌, బీర్చల్‌గా ఖ్యాతి గడించిన సతీందర్‌ కుమార్‌ ఖోస్లా (84) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెనొప్పితో ముంబైలోని కోకిలాబెన్‌ దవాఖానలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఖోస్లా చనిపోయినట్టు ఆయన స్నేహితుడు జగ్ను ధ్రువీకరించారు. ఖోస్లా అంత్యక్రియలు […]

Satinder Kumar Khosla

  • ముంబైలో గుండెపోటుతో తుదిశ్వాస
  • బీర్బల్‌గా బాలీబడ్‌ ఇండస్ట్రీలో ఖ్యాతి
  • వివిధ భాషల్లో 500 చిత్రాల్లో నటన
  • సినీ ప్రముఖుల సంతాపం

విధాత: బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొన్నది. సీనియర్‌ నటుడు, షోలే ఫేమ్‌, బీర్చల్‌గా ఖ్యాతి గడించిన సతీందర్‌ కుమార్‌ ఖోస్లా (84) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెనొప్పితో ముంబైలోని కోకిలాబెన్‌ దవాఖానలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఖోస్లా చనిపోయినట్టు ఆయన స్నేహితుడు జగ్ను ధ్రువీకరించారు. ఖోస్లా అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సతీందర్‌ హఠాన్మరణంతో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, సినీ సంఘాలు సంతాపం తెలిపాయి.

1983లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఖోస్లా జన్మించారు. 1967లో ఉపకార్‌ చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ, పంజాబీ, భోజ్‌పురి మరాఠీతో సహా వివిధ భాషల్లో 500లకుపైగా చిత్రాలలో కనిపించారు. బాలీవుడ్‌లో రోటీ కప్డా ఔర్ మకాన్ వంటి అనేక హిట్‌ చిత్రాల్లో ఖోస్లా నటించారు. ప్రఖ్యాత షోలే చిత్రం ద్వారా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో ఖైదీగా ఖోస్లా నటించారు. ఆయన నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాల్లో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

Updated On 13 Sep 2023 6:06 AM GMT
somu

somu

Next Story