విధాత‌: హీరోయిన్లలో పూర్ణ గురించి తెలియని వారు ఉండరు. వాస్తవానికి ముస్లిం యువతి అయిన ఈమె రవిబాబు నటించిన హారర్ సినిమా ‘అవును 1, 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. శ్రీ‌మ‌హాలక్ష్మి, ల‌డ్డుబాబు, నువ్విలా నేనిలా, జయంబు నిశ్చయంబురా, సీమ టపాకాయ్, రాజుగారి గది, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, శ్రీ‌మంతుడు, మామ మంచు.. అల్లుడు కంచు, అదుగో, సువ‌ర్ణ‌సుంద‌రి, ప‌వ‌ర్ ప్లే, సుంద‌రి, దృశ్యం2, అఖండ‌, త‌లైవి, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలలో […]

విధాత‌: హీరోయిన్లలో పూర్ణ గురించి తెలియని వారు ఉండరు. వాస్తవానికి ముస్లిం యువతి అయిన ఈమె రవిబాబు నటించిన హారర్ సినిమా ‘అవును 1, 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. శ్రీ‌మ‌హాలక్ష్మి, ల‌డ్డుబాబు, నువ్విలా నేనిలా, జయంబు నిశ్చయంబురా, సీమ టపాకాయ్, రాజుగారి గది, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, శ్రీ‌మంతుడు, మామ మంచు.. అల్లుడు కంచు, అదుగో, సువ‌ర్ణ‌సుంద‌రి, ప‌వ‌ర్ ప్లే, సుంద‌రి, దృశ్యం2, అఖండ‌, త‌లైవి, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది.

రీసెంట్‌గా అఖండ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. అనంతరం దుబాయిలో వ్యాపారవేత్త అయిన శానిద్ ఆసిఫ్ అలీతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. నెలలు గడుస్తున్నా పెళ్లి వార్త చెప్పకపోవడంతో అంతా బ్రేకప్ అయ్యిందని అనుకుంటున్న సమయంలో జూన్ 12న దుబాయిలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగింది.

కొన్ని పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా వేడుక పూర్తయింది. కేరళలో ఉన్న బంధువులు, మిత్రుల కోసం ఇండియాలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని పూర్ణ చెప్పింది. ఈ విషయాలు చెప్పి చాలా కాలం అవుతుంది. కానీ ఎలాంటి మ్యారేజ్ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయలేదు.

ఇంతలోనే తాను తల్లిని అవుతున్నానంటూ ప్రకటించి మరో షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను తెలియజేసింది. దాంతో పూర్ణకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఎక్కువగా ఇండియాలోనే ఉంటున్న పూర్ణ తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది. అయితే ఈ మధ్య నయనతార కూడా ఇలానే షాకిచ్చింది. లెక్క ప్రకారం పెళ్లయి 6 నెలలే అవుతున్నా.. పూర్ణ గర్భవతినని చెప్పడం చూస్తుంటే.. సెలబ్రిటీలు కొత్త పోకడలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కాగా.. వివాహం జరిగినప్పటికీ ఈమె నటిగా, టెలివిజన్ ప్రెజెంట‌ర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషల‌ చిత్రాలు చేస్తున్నారు. నాని- కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న దసరా మూవీలో పూర్ణ ఒక కీలకపాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

దసరా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా బుల్లి తెరపై పలు డాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షో లలో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. మొత్తానికి కెరీర్ బిగినింగ్ లో ‘అవును, సీమటపాకాయ్’ వంటి మంచి విజయాలను సాధించిన పూర్ణ ఆ తరువాత మాత్రం క్రేజ్ ను నిలబెట్టుకోలేక పోయిందని చెప్పాలి.

Updated On 2 Jan 2023 4:17 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story