Wednesday, March 29, 2023
More
    Homelatestగురూజీ.. ఆ మలయాళీనే కాదు.. మమ్మలి కూడా పట్టించుకోండి: త్రివిక్రమ్‌పై హీరోయిన్ సంచలన కామెంట్స్

    గురూజీ.. ఆ మలయాళీనే కాదు.. మమ్మలి కూడా పట్టించుకోండి: త్రివిక్రమ్‌పై హీరోయిన్ సంచలన కామెంట్స్

    Rekha Boj, Samyukta Menon, Trivikram

    విధాత‌, సినిమా: దర్శకుడు అన్న తర్వాత వారికి హీరో హీరోయిన్లతో చనువుంటుంది. తమ ఇంటి కుటుంబ సభ్యుల్లా వారిని చూసుకుంటే సినిమా అవుట్ ఫుట్ కూడా అంత బాగా వస్తుంది. వారిని తమ సొంత మనుషులుగా భావిస్తే ప్రొడక్ట్‌కు ఉపయోగపడుతుంది. త్రివిక్రమ్ (Trivikram) అదే చేస్తారు. తనతో సినిమాలు చేసిన హీరోయిన్లను ప్రేమిస్తాడు. వారిని సర్వంగా భావిస్తూ వారి పాత్రను అద్భుతంగా తెరకెక్కిస్తారు. హీరోయిన్ పాత్ర‌లు జనానికి గుర్తుండి పోయేలా చేస్తారు. ఆ పాత్రలను అంతగా ప్రేమిస్తారు కాబట్టే ఆ పాత్రలలో హీరోయిన్లను కూడా అంతగా ప్రేమిస్తారు.

    ఇక త్రివిక్రమ్ తెర ముందు, వెనుక.. మాటల‌ మాంత్రికుడు కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం రొమాంటిక్ హీరో అని ఆయనపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్‌తో డేటింగ్ చేశాడంటూ ప్రచారాలు కూడా జరిగాయి.

    ఆ రూమ‌ర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఆయన తీరు, నడవడిక చూస్తే ఆ రూమర్స్ ఒక్కోసారి నిజమేనేమో అని అభిప్రాయం కలగజేస్తుంటాయి.

    ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే (Pooja Hegde) తోటి ఆయన సినిమాలు చేశారు. అరవింద సమేత వీర‌రాఘ‌వ‌, అల వైకుంఠపురములో చిత్రాలతో పాటు రీసెంట్‌గా మహేష్ బాబు (Mahesh Babu) మూవీలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు.

    పూజా హెగ్డేతో పాటు మలయాళం స్టార్ హీరోయిన్ సంయుక్తా మీన‌న్‌ (Samyukta Menon)తో కూడా త్రివిక్రమ్ సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

    ‘భీమ్లా నాయక్(Bhimla Naik)’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మ‌డు ఆ తర్వాత బింబిసార, సార్ వంటి సూపర్ హిట్స్ సినిమాల‌లో నటించింది. ‘భీమ్లానాయక్, సార్’ చిత్రాలకు త్రివిక్రమ్ ప‌నిచేశారు. భీమ్లానాయ‌క్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా వ్యవహరించారు. సార్ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు.

    ఈ రెండు సినిమాల్లో ఆమెకు అవకాశం రావడానికి త్రివిక్రమ్ శ్రీనివాసే కారణమని సోషల్ మీడియాలో రూమ‌ర్ ఉంది. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా సంయుక్తా మీన‌న్‌కు ఐ లవ్ యూ చెప్పి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో నెటిజన్లే కాకుండా ఓ హీరోయిన్ కూడా త్రివిక్రమ్‌పై హాట్ హాట్ కామెంట్స్ పేల్చింది. ఇప్పుడామె కామెంట్స్ ఇండస్ట్రీలో సెగలు రేపుతున్నాయి.

    ‘దామిని విల్లా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేఖా భోజ్ (Rekha Boj).. త్రివిక్రమ్, సంయుక్త మధ్య ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. ‘ఎప్పుడూ.. ఆ మలయాళీ మీద మాత్రమే కాదు గురూజీ మాలాంటి వాళ్లను కూడా కాస్త పట్టించుకోండి’ అని పోస్ట్ చేసింది.

    దాని కింద నెటిజన్స్ ఎవరు అని అడగ్గా దానికి రేఖా భోజ్ సమాధానం ఇస్తూ.. ఇంకెవరు రీసెంట్‌గా మన గురూజీ చ‌ల్ల‌ని చూపులు దక్కించుకున్న సంయుక్తా మీనన్ అని రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దీనిపై త్రివిక్ర‌మ్ అండ్ టీం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి వుంది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular