Taapsee Pannu | కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. అయితే, సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తాప్సీ బాలీవుడ్‌కు పయనమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టి హిందీలోనే వరుస సినిమాలు చేస్తున్నది. అడపాదడపా ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తున్నది. టాలెంటెడ్ నటిగా పేరుతెర్చుకున్న తాప్సీ.. తాజాగా ఓ భారీ లగ్జరీ కారును కొనుగోలు […]

Taapsee Pannu |
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. అయితే, సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తాప్సీ బాలీవుడ్‌కు పయనమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టి హిందీలోనే వరుస సినిమాలు చేస్తున్నది. అడపాదడపా ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తున్నది.
టాలెంటెడ్ నటిగా పేరుతెర్చుకున్న తాప్సీ.. తాజాగా ఓ భారీ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. వినాయక చవితి సందర్భంగా సోమవారం కొనుగోలు చేసింది. ఈ కారు మెర్సెడెజ్ మేబారచ్ జీఎల్ఎస్ 600 ఎస్‍యూవీ కారును ఢిల్లీ బ్యూటీ కొనుగోలు చేసింది. అయితే, ఈ కారు ఎక్స్ షోరూం ధరనే అక్షరాల రూ.2.92కోట్లు. మొజావే సిల్వర్ సింగిల్ టోన్ కలర్ ఫినిష్ ఉన్న కారును కొనుగోలు చేయగా.. ఆన్‌రోడ్ ధరను పరిశీలిస్తే రూ.3కోట్లకుపైగా ఉంటుంది.
కారులో లాంజ్ స్టైల్ సీటింగ్, పానరామిక్ సన్‍రూఫ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజింగ్ సీట్లు, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, వర్చువల్ అసిస్టెంట్, స్మాల్ రిఫ్రిజిరేటర్ సహా చాలా అడ్వాన్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఉంటాయి. మెర్సెడెస్ మేబారచ్ జీఎల్ఎస్ 600 కారులో 4.0-లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ పవర్ ఫుల్ ఇంజిన్ ఉండగా.. 9జీ ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్నది.
550 హెచ్‍పీ వరకు పవర్, 730 ఎన్ఎం వరకు పీక్ టార్క్‌ను జనరేట్ చేసే సామర్థ్యం ఉన్నది. 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‍మెంట్ టచ్ స్క్రీన్, 12.3 ఇంచుల డ్రైవర్ డిస్‍ప్లే తదితర లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తాప్సీ చివరిగా ‘బ్లర్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నది. ఓ లడ్‌కీ హై కహాన్, డుంకీ, ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రుబా చిత్రాల్లో నటిస్తున్నది.
Trisha Krishnan | ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్న త్రిష..! నిర్మాతతో పీకల్లోతు ప్రేమలో..!
