విధాత: Adani vs Hindenburg అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ (Supreme Court Expert Committee) ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే (Retired Judge Justice Abhay Manohar Sapre) ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
రెండు నెలల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ వివాదం విషయంలో గతంలో కేంద్రం సమర్పించిన సీల్డ్ కవర్ ప్రతిపాదనలను కోర్టు తిరస్కరించింది.
సీల్డ్ కవర్‌లో కేంద్రం ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోబోమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం గతంలో పేర్కొన్నది. కేసు విచారణలో పూర్తి పారదర్శకత ఉండాలని… అందుకే తామే ఓ నిపుణుల కమిటీని నియమిస్తామని గత విచారణ సమయంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.