విధాత: అడవి శేషు, సుప్రియ డేటింగ్‌పై మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తాజాగా క్రిస్మస్ వేడుకల్లో అడవి శేషు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పాల్గొన్నాడు. అక్కినేని నాగార్జున మేనకోడలిగా సుప్రియ యార్లగడ్డ అందరికీ పరిచయమే.
పవన్ కల్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అనే చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పవన్ మొదటి చిత్రంగా అందరికీ బాగా గుర్తు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె అడవి శేషుతో కలిసి గూఢచారి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఈమె రామోజీరావు నిర్మించిన ‘ఇష్టం’ చిత్రంలో హీరోగా నటించిన వ్యక్తిని వివాహం చేసుకొంది. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఈమె మాజీ భర్త ఇటీవలే మరణించాడని కూడా వార్తలు వచ్చాయి.
ఇక గూఢచారి సమయంలో అడవి శేషు, సుప్రియ ఇద్దరూ రిలేషన్లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు వారు ఖండిస్తూనే ఉన్నారు. అయినా ఈ డేటింగ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం సుప్రియ అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలను చూసుకుంటుంది.
సింగిల్‌గా ఉన్నటువంటి సుప్రియ హీరో అడవి శేషుతో రిలేషన్స్‌లో ఉందని వార్తలు వచ్చి వాటిని వారు ఖండించినా కూడా.. తాజాగా అక్కినేని ఫ్యామిలీతో కలిసి అక్కినేని కుటుంబంలో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు అడవి శేషు హాజరు కావడం ఏమిటా? అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో మరోసారి సుప్రియ, శేషు డేటింగ్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సుప్రియ, అడవి శేషు ఇద్దరూ చాలా చనువుగా పక్కపక్కనే ఉండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. వీరందరూ ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కి నాగచైతన్య దూరంగా ఉన్నాడు.
చైతన్య వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడు. ఇక త్వరలో అడవి శేషు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కొత్త సినిమా చేయనున్నాడు. దీంతో సుప్రియ, అడవిశేషు డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. మరి ఈ ఫోటోపై, డేటింగ్ వార్తలపై అడవి శేషు, సుప్రియ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
Merry Christmas! 💐🤗❤️
Much love to all of you! pic.twitter.com/sbpwXEqkMP— Sushanth A (@iamSushanthA) December 25, 2022