Adilabad విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఆసుప‌త్రి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రి భవనం స్థానంలో కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. ఆసుప‌త్రి బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఆసుపత్రిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే ఆలోచనతో అధికారులు ఆసుపత్రి భవనానికి సమీపంలో ఉన్న పాత ఎంపీడిఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ ను ఖాళీగా ఉన్న పాత యం.పి.డి. […]

Adilabad

విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఆసుప‌త్రి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రి భవనం స్థానంలో కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి శిలాఫలకం వేశారు.

ఆసుప‌త్రి బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఆసుపత్రిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే ఆలోచనతో అధికారులు ఆసుపత్రి భవనానికి సమీపంలో ఉన్న పాత ఎంపీడిఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ హాస్పిటల్ ను ఖాళీగా ఉన్న పాత యం.పి.డి. ఓ ఆఫీస్ లోకి తాత్కాలికంగా మార్చారు. ఎంపీడీవో కార్యాలయం సైతం శిథిలావస్థలో ఉండడం వర్షం పడితే తడుస్తుందని రేకులు మొత్తం చిల్లులు పడి ఉన్నాయని వెంటనే వాటిని రిపేర్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తాత్కాలికంగా ఆసుపత్రి రిపేర్ కోసం ఒక కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ రెండు రోజుల్లో రేకులు మార్చి భవనం కురవకుండా చేస్తానని చెప్పి వారం రోజులైనా పట్టించుకోల‌లేదు.

ఈ క్ర‌మంల‌ల‌లో నిన్న కురిసిన అకాల భారీ వర్షాలకు వర్షం నీళ్లు పగిలిపోయిన రేకుల నుంచి ఆసుపత్రి లోపలికి రావడంతో విలువైన సామాగ్రి తో పాటు రికార్డులు కూడా తడిసిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. ఏదైనప్పటికీ శాశ్వత భవనం పూర్తి అయ్యేవరకు ఈ తాత్కాలిక ఆసుపత్రి భవనం రేకులను కురవకుండా కొత్త రేకులను వేసి తొందరగా రిపేరు చేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

Updated On 22 May 2023 2:56 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story