Chandrababu 19 వరకు బాబు జైలులోనే క్వాష్‌ పిటిషన్‌..ముందస్తు బెయిల్‌ విచారణ 19కి వాయిదా 18 వరకు సీఐడీ కస్టడీ పిటిషన్‌ విచారణ నిలుపుదల ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు విధాత, విజయవాడ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు ఈనెల 19వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణను కోర్టు ఈ నెల […]

Chandrababu

  • 19 వరకు బాబు జైలులోనే
  • క్వాష్‌ పిటిషన్‌..ముందస్తు బెయిల్‌ విచారణ 19కి వాయిదా
  • 18 వరకు సీఐడీ కస్టడీ పిటిషన్‌ విచారణ నిలుపుదల
  • ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు

విధాత, విజయవాడ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు ఈనెల 19వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌ పై కౌంటర్‌ దాఖలుకు సీఐడీ తరుపు న్యాయవాదులు సమయం కోరడంతో ఇరువైపుల వాదన వినాల్సి ఉన్నందునా మంగళవారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు జడ్జీ విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.

అలాగే చంద్రబాబును కస్టడీ కోరుతు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను ఈ నెల 18 వరకు నిలుపుదల వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని చంద్రబాబు లాయర్‌ సిద్ధార్ధ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా, సీఐడీ పిటిషన్‌ విచారణ నిలుపుదలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జడ్జీ తాను గతంలో పీపీగా పనిచేశానని, అభ్యంతరాలుంటే పిటిషన్‌ విచారణ వేరే బెంచ్‌కు మారుస్తాననని చంద్రబాబు తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. అందుకు బాబు న్యాయవాది సిద్ధార్ద లూథ్రా తమకు అటువంటి అభ్యంతరాలేవి లేవని చెప్పడంతో విచారణ కొనసాగింది. అలాగే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ముందస్తు బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌ కూడా హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టీడీపీ శ్రేణుల గృహనిర్భంధం, ముందస్తు అరెస్టులపై దాఖలైన పిటిషన్‌ విచారణను కూడా హైకోర్టు రెండువారాలకు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. సీఎస్‌, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు నోటీస్‌లు జారీ చేసిన హైకోర్టు కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. టీడీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని, చట్ట వ్యతిరేకంగా గృహనిర్భంధం చేసిందని పిటిషనర్‌ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. అటు క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా

క్వాష్‌ పిటిషన్‌పై సమయం కోరడం సాగదీయడమే: ఎంపీ కనకమేడల

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ప్రభుత్వం సమయం కోరడం సాగదీత ధోరణితో కుట్ర పూరితంగా చేసిందేనని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. విచారణ ఎదుర్కోలేక, చంద్రబాబున వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో ఉంచే లక్ష్యంతో ప్రభుత్వం ఎత్తులు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రిలే నిరసన దీక్షలతో హోరెతించాయి.

Updated On 13 Sep 2023 10:47 AM GMT
somu

somu

Next Story