తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటన విధాత, నిజామాబాద్: ఒక వైపు పోలీసులు అరెస్ట్ చేస్తుండగానే మరో వైపు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. రైతులకు అడ్వకేట్ జేఏసి మద్దతు ప్రకటించింది. ధర్నా సందర్బంగా ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి కుమ్మరి రాజయ్య మాట్లాడుతూ తదుపరి కార్యక్రమాన్ని కమిటీ సమావేశమై త్వరలో ప్రకటిస్తామన్నారు. కాగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో […]

  • తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటన

విధాత, నిజామాబాద్: ఒక వైపు పోలీసులు అరెస్ట్ చేస్తుండగానే మరో వైపు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. రైతులకు అడ్వకేట్ జేఏసి మద్దతు ప్రకటించింది. ధర్నా సందర్బంగా ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి కుమ్మరి రాజయ్య మాట్లాడుతూ తదుపరి కార్యక్రమాన్ని కమిటీ సమావేశమై త్వరలో ప్రకటిస్తామన్నారు.

కాగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో రైతులు, బీజేపీ, కాంగ్రెస్, అడ్వకేట్ జేఏసి ప్రతినిధులు పాల్గొన్నారు.

మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ పై స్వీకరిస్తున్న అభ్యంతరాలకు చివరి రోజు కావడం, రైతులు ధర్నాల‌కు పిలుపునివ్వడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద అదనపు ఎస్పీ అనోన్య, డిఎస్పీ సోమనాథం, టౌన్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ముందస్తుగా పోలీసులు అడ్లూర్ ఎల్లారెడ్డి, అడ్లూర్, టేక్రియాల్ గ్రామాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ లతో రైతులు మున్సిపల్ కార్యాలయం వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, డాక్టర్ వెంకట్, జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి, ఇసాక్ షేరు, బీజేపీ దత్తెష్వరి, తేలు శ్రీనివాస్, విపుల్, బాలమణి, కౌన్సిలర్లు శ్రీనివాస్, ప్రవీణ్, మోటారి శ్రీకాంత్, హన్మాండ్ల సురేష్, అడ్వకేట్ జేఏసి తరపున న్యాయవాదులు జి. జగన్నాథం, క్యాతం సిద్దిరాములు, మంద వెంకట్రాంరెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి, టేక్రియాల్, అడ్లూర్, ఇల్చిపూర్, లింగాపూర్, పాతరాజంపేట, కామారెడ్డి పట్టణ రైతులు పాల్గొన్నారు.

Updated On 11 Jan 2023 11:06 AM GMT
krs

krs

Next Story