విధాత: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ,మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఐదవ తేదీన నిర్వహించిన అర్హత పరీక్షను TSPSC రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించిన కమిషన్ ఏఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ ఈ పరీక్షను నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని TSPSC తెలిపింది. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 ఉద్యోగాలకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల […]

విధాత: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ,మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఐదవ తేదీన నిర్వహించిన అర్హత పరీక్షను TSPSC రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించిన కమిషన్ ఏఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ ఈ పరీక్షను నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని TSPSC తెలిపింది.

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 ఉద్యోగాలకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. 74,478 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడు జిల్లాల్లోని 162 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 68,257మంది అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా పేపర్ వన్ కు 55 వేల 159 మంది, పేపర్ 2 కు 54,917 మంది హాజరయ్యారు.

కాగా టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీకేజీ అయినట్లుగా అనుమానిస్తున్నారు. అలాగే పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ ద్వారా TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ నుంచి క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్ మొత్తం తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్నట్లు సమాచారం. అందులో వివిధ పరీక్షల పేపర్లు ఉన్నాయన్న సమాచారంతో ఇప్పటివరకు నిర్వహించిన ఏడు పరీక్షలను కూడా రద్దు చేయాలన్న డిమాండ్ పెరిగిపోతుంది.

Updated On 16 March 2023 2:14 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story