AE | 112 ప్రభుత్వ జీవో సమర్థన విధాత, హైదరాబాద్: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 11 ఏళ్ల సర్వీసున్న అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగోన్నతికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారంతా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఉద్యోగోన్నతికి అర్హులేనని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 112 సమర్థనీయమేనని స్పష్టం చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. నిబంధనలు సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తేల్చిచెప్పింది. 2022, మార్చి 26న […]

AE |
112 ప్రభుత్వ జీవో సమర్థన
విధాత, హైదరాబాద్: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 11 ఏళ్ల సర్వీసున్న అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగోన్నతికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారంతా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఉద్యోగోన్నతికి అర్హులేనని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 112 సమర్థనీయమేనని స్పష్టం చేసింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. నిబంధనలు సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తేల్చిచెప్పింది. 2022, మార్చి 26న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 112 సవాల్ చేస్తూ నల్లగొండ, మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ నాయక్ సహా కొందరు ఏఈఈలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ జీవో తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ సర్వీస్ రూల్స్ 2018కి విరుద్ధమని, జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం తుది ఉత్తర్వులు వెలువరించింది.
ఏఈల ఇంప్లీడ్ పిటిషన్ వేసిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ఏఈలకు కూడా ఉద్యోగోన్నతులు ఇవ్వవచ్చని గతంలో ఇదే హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఆ కాపీని కూడా న్యాయమూర్తికి సమర్పించారు. ప్రభాకర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ప్రభుత్వ జీవోను సమర్థించింది. జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
