Wednesday, March 29, 2023
More
    Homeతెలంగాణ‌Warangal: బిల్లులు చెల్లించిన BJP నేతలు.. 6 నెలల తర్వాత DCతండాలో వెలుగులు

    Warangal: బిల్లులు చెల్లించిన BJP నేతలు.. 6 నెలల తర్వాత DCతండాలో వెలుగులు

    • ఎట్టకేలకు కరెంటు పునరుద్ధరణ
    • ఎమ్మెల్యే ఆరూరు పై కొండేటి ఆగ్రహం
    • టిఆర్ఎస్ మద్దతుదారులకే వత్తాసు

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత ఆరు నెలలుగా కరెంటు కట్(Power Cut) చేయడంతో చీకట్లో బాధపడుతున్న డిసి తండా(DC Thanda) వాసుల ఇండ్లల్లో ఎట్టకేలకు వెలుగులు ప్రసరించాయి. గిరిజన బిడ్డలను చీకటి నుంచి విముక్తి చేసేందుకు భారతీయ జనతా పార్టీ(BJP) నేతలు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలోని 70 వరకు గిరిజన కుటుంబాలు కరెంట్ బిల్లులు సక్రమంగా చెల్లించలేదు. ఈ కారణంగా వారి కరెంటు కట్ చేశారు. గత ఆరు నెలలుగా తండావాసులు చీకట్లోనే మగ్గుతున్నారు. మాజీ శాసన సభ్యులు, బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్(Kondeti Sridhar) దృష్టికి సమస్య రావడంతో ఆయన స్పందించి 70 కుటుంబాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలను తండా వాసులతో కలిసి చెల్లించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంటు పునరుద్ధరించారు. డి.సి.తండా వాసులు బండి సంజయ్‌కు, కొండేటి శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    పట్టించుకోని ఎమ్మెల్యే ఆరూరి రమేష్

    స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దృష్టికి డిసి తండా వాసులు ఎన్నోసార్లు కరెంటు రావడం లేదనే విషయాన్ని విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు వివరించారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో డీసీ తండావాసులు మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు కొండేటి శ్రీధర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవలే వర్ధన్నపేట పట్టణంలో జరిగిన ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమానికి విచ్చేసిన కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కీ కరెంటు విషయమై తమ గోడును తండావాసులు వెళ్లబోసుకోగా బండి సంజయ్ స్పందించారు. కొండేటి శ్రీధర్ ద్వారా రూ.2లక్షల మేరకు బిల్లు చెల్లించేందుకు ఏర్పాటు చేశారు.

    పేదల ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు: కొండేటి

    పేదల కోసమే పనిచేస్తుందని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ డీసీ తండాలోని వంద ఇండ్లకు మాత్రమే ఎందుకు కరెంటు ఇప్పించలేపోయారని బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ప్రశ్నించారు. విద్యుత్ శాఖ ఏఈ దగ్గరకి వెళ్ళి తండా వాసుల బకాయిలు చెల్లింపుల విషయంలో తను పూచీకత్తుగా ఉంటానని వ్రాతపూర్వకంగా ఇస్తా అన్న కూడా ఆ తండా వాసులకు కరెంట్ సప్లై ఇవ్వలేదన్నారు. కేవలం బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన వారికి మాత్రమే కరెంట్ సప్లై ఇచ్చి మిగతా వాళ్లకు ఇవ్వకుండా ఎమ్మెల్యే చేసిన నిర్వాహకమన్నారు. సామాన్యుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి బిజెపి కార్యకర్తలను ఇలాంటి ఒత్తిడిలకు గురి చేసే బిఆర్ఎస్ పార్టీ నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తేజా నాయక్, బానోతు ప్రవీణ్, ఆంగోత్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular