AGENT, Anil Sunkara
యంగ్ హీరో అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చి.. భారీ డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసిన వాళ్లంతా.. అసలిది సినిమాయేనా? తలా తోకా ఉందా? అనేలా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఈ సినిమా తెరపైకి ఎక్కించే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో అఖిల్ చెప్పుకొచ్చారు.
నిర్మాత అనిల్ సుంకర కూడా చిత్ర ప్రమోషన్స్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రభావం చూపిస్తుందనేలా కామెంట్స్ చేశాడు. తీరా సినిమా విడుదలై.. టాక్ తేడాగా వచ్చేసరికి.. ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఓ మెసేజ్‌ని పోస్ట్ చేశాడు. అనిల్ సుంకర్ పోస్ట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే.. నార్మల్ ప్రేక్షకులు మాత్రం ఇదేదో తప్పించుకోవడానికి చేసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don't want to give any excuses but learn…
— Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023
‘‘ఏజెంట్ సినిమా విషయంలో ప్రేక్షకుల, విమర్శకుల తీర్పును మేము స్వీకరిస్తున్నాము. మాకు తెలుసు ఈ సినిమా ఒక పెద్ద టాస్క్‌తో కూడుకున్నదని, కానీ ఫెయిల్ అయ్యాము. బౌండెడ్ స్ర్కిప్ట్ లేకుండా ఈ సినిమా స్టార్ట్ చేసి తప్పు చేశాం.. ఆ తర్వాత కోవిడ్ వంటివి దానికి తోడయ్యాయి.
ఇలా ఒక సాకు చెప్పి తప్పించుకోవటం మా ఉద్దేశ్యం కాదు, కానీ ఈ తప్పు నుండి నేర్చుకొని.. మళ్ళీ ముందు ముందు ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకుంటాము. మా మీద నమ్మకంతో.. సినిమాపై ఆశలు పెట్టుకున్న అందరికీ క్షమాపణలు. ఈ సినిమా కొచ్చిన నష్టాన్ని హార్డ్ వర్క్ చేసి.. రాబోయే ప్రాజెక్ట్‌లతో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము’’ అని ట్విట్టర్ వేదికగా అనిల్ సుంకర అక్కినేని ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు క్షమాపణలు కోరారు.
అయితే అనిల్ సుంకర్ చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు రకరకాలుగా కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. వక్కంతం వంశీ అనే కథా రచయితని పెట్టుకుని, పాన్ ఇండియా స్థాయిలో సినిమా అని చెప్పి.. ఇప్పుడేంటి ఇలా ప్లేట్ మార్చేస్తున్నాడు. బహుశా డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటి ముందు దీక్షకు దిగుతారని కాబోలు.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటూ ముందుగానే ఓ మాటేశాడనిపిస్తోంది.
ఆయన ట్వీట్ తర్వాత.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా అఖిల్‌ని అంత కష్టపెట్టడం ఏమిటని అక్కినేని ఫ్యాన్స్ అంటుంటే.. మాకు బొక్క పెట్టడం ఏమిటని సాధారణ ప్రేక్షకులు అంటున్నారు. మాములుగా ఆయన సినిమాతో మెప్పించలేకపోయినందుకు క్షమాపణలు అని అంటే సరిపోయేది. అలా కాకుండా.. బౌండెడ్ స్ర్కిప్ట్ అంటూ ఇప్పుడు సరికొత్త వివాదానికి అనిల్ సుంకర తెరలేపాడు.
పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రకటించి.. స్క్రిప్ట్‌కి రూ. 2 కోట్లు, సినిమా మొత్తానికి దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం.. ఇంటిమీదికి డిస్ట్రిబ్యూటర్స్‌ని రానీయకుండా చేసుకోవడానికే అనేలా అయితే పక్కాగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ‘ఏజెంట్’ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ మొత్తం కలిపినా రూ. 10 కోట్లు కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు. మరి ఈ లాస్‌ని అనిల్ సుంకర ఎలా కవర్ చేసుకుంటాడో.. చూడాల్సి ఉంది.