Aghora | త‌న స్నేహితుడి మృత‌దేహంపై ఓ అఘోరా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు వ‌ద్ద ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. సూలూరు స‌మీపంలోని కురుంబ‌పాళెయానికి చెందిన మ‌ణికంఠ‌న్ వృత్తిరీత్యా అంబులెన్స్ డ్రైవ‌ర్. మ‌ణికంఠ‌న్‌కు రెండేండ్ల క్రితం వివాహం కాగా, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మ‌ణికంఠ‌న్‌.. […]

Aghora | త‌న స్నేహితుడి మృత‌దేహంపై ఓ అఘోరా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు వ‌ద్ద ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సూలూరు స‌మీపంలోని కురుంబ‌పాళెయానికి చెందిన మ‌ణికంఠ‌న్ వృత్తిరీత్యా అంబులెన్స్ డ్రైవ‌ర్. మ‌ణికంఠ‌న్‌కు రెండేండ్ల క్రితం వివాహం కాగా, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి.

ఆదివారం రాత్రి కూడా ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మ‌ణికంఠ‌న్‌.. ఆదివారం విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు.

మ‌ణికంఠ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం త‌న చిన్న‌నాటి దోస్తుకు తెలిసింది. అఘోరా అయిన ఆ స్నేహితుడు.. మ‌ణికంఠ‌న్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించేందుకు వ‌చ్చాడు. అత‌ని అంత్య‌క్రియ‌ల్లో కూడా పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా మ‌ణికంఠ‌న్ డెడ్‌బాడీపై అఘోరా కూర్చొని పూజ‌లు చేశాడు. ఈ పూజ‌ల వ్య‌వ‌హారం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పూజ‌లు ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని స్థానికులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Updated On 31 May 2023 10:19 AM GMT
subbareddy

subbareddy

Next Story