విధాత: అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడంపై అభ్యంతరం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై అగ్రిగోడ్ల్ డిపాజిటర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, రూ. 6,640 కోట్ల కుంభకోణమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లు మాత్రమే రాబట్టిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏలూరు కోర్టుకు […]

విధాత: అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడంపై అభ్యంతరం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై అగ్రిగోడ్ల్ డిపాజిటర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, రూ. 6,640 కోట్ల కుంభకోణమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లు మాత్రమే రాబట్టిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏలూరు కోర్టుకు వెళ్లాలని డిపాజిటర్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
