Air Pollution | ఆయుర్దాయంలో సగటున 5.3 సంవత్సరాల కోత ఉత్తర భారతంలో పరిస్థితి మరింత ప్రమాదకరం విపరీతంగా పెరుగుతున్న పీఎం 2.5 అణువులు పారిశ్రామికీకరణ, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో వాయు కాలుష్యం (Air Pollutuion) కొత్త కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో (University Of Chicago) 2023 నివేదిక వెల్లడించింది. వాతావరణంలో పర్టిక్యులేట్ మేటర్ 2.5 (పీఎం […]

Two men walk along Rajpath amid smoggy conditions in New Delhi on January 28, 2021. (Photo by Jewel SAMAD / AFP)
Air Pollution |
- ఆయుర్దాయంలో సగటున 5.3 సంవత్సరాల కోత
- ఉత్తర భారతంలో పరిస్థితి మరింత ప్రమాదకరం
- విపరీతంగా పెరుగుతున్న పీఎం 2.5 అణువులు
పారిశ్రామికీకరణ, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో వాయు కాలుష్యం (Air Pollutuion) కొత్త కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో (University Of Chicago) 2023 నివేదిక వెల్లడించింది.
వాతావరణంలో పర్టిక్యులేట్ మేటర్ 2.5 (పీఎం 2.5) వల్ల భారతీయుల ఆయుర్దాయం సగటున 5.3 సంవత్సరాలకు పడిపోయిందని పేర్కొంది. ఉత్తర భారతంలో అయితే ఇది 8 ఏళ్లుగా ఉండొచ్చని తెలిపింది. దీనిని అత్యంత ప్రమాదకరమైన పోకడగా నివేదిక అభివర్ణించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతించిన ఒక క్యూబిక్ మీటర్ కు 5 మై.గ్రా కాలుష్య కారకాలు ఉంటే లభించే ఆయుర్దాయంతో పోలిస్తే భారతీయులు 5.3 ఏళ్లు తక్కువుందని అధ్యయన కర్తలు వెల్లడించారు.
భారతీయుల ఆయుర్దాయాన్ని తగ్గించే ఇతర సమస్యల గురించి ఈ నివేదిక చెప్పిన ప్రకారం.. గుండోపోటు సంబంధిత సమస్యల వల్ల 4.5 ఏళ్లు, ప్రసవ, ప్రసవానంతర సమస్యల వల్ల 1.8 ఏళ్లు ఆయుర్దాయం తగ్గుతోంది. భారత దేశంలోని 130 కోట్ల మంది ప్రజలూ కూడా డబ్ల్యూహెచ్ఓ (WHO) సూచించిన వాయు కాలుష్య పరిమితి కంటే తీవ్రమైన కాలుష్య ప్రదేశాల్లో జీవిస్తున్నారు.
భారత్ విధించుకున్న పరిమితులతో పోల్చుకున్నా 67.7 శాతం మంది కాలుష్య కాసారాల్లోనే నివసించడం గమనార్హం. ఈ అధ్యయనం అంచనా వేసిన ప్రకారం.. 1998 నుంచి 2021 వరకు దేశంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల రేటు అసాధారణంగా 67.7 శాతం వరకు ఉంది.
ఇది ఇలానే కొనసాగితే మరో కొన్ని దశాబ్దాల్లో మరో 2.3 ఏళ్ల ఆయుర్దాయం తగ్గిపోతుందని పరిశోధకులు హెచ్చరించారు. మరోవైపు దిగ్భ్రాంతికరంగా 2013 నుంచి 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటానే 59.1 శాతం ఉందని పేర్కొంది.
భారత సరిహద్దు దేశాల విషయానికొస్తే పీఎం 2.5 అణువుల సంఖ్య 9.5 శాతం వరకు పెరగగా పాక్‌లో ఇది 8.8 శాతంగా, బంగ్లాదేశ్‌లో 12.4 శాతంగా ఉంది. ఏక్యూఎల్ఐగా పిలిచే ఈ అధ్యయనం.. కాలుష్యం వల్ల ఆయుర్దాయంపై పడే ప్రభావాన్ని పరిశోధన చేస్తుంది. షికాగో విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసే మైఖేల్ గ్రీన్‌స్టోన్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు.
