విధాత: ఈ సంక్రాంతికి తెలుగు నాట ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు చిత్రాలు టాప్ తెలుగు స్టార్స్ అయినా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. 100 కోట్లను వసూలు చేసి రెండు వందల కోట్ల దిశగా తమ పయనం కొనసాగిస్తున్నాయి. ఇక తెలుగులో విడుదలైన మరో చిన్న చిత్రం సంతోష్ శోభన్ హీరోగా […]

విధాత: ఈ సంక్రాంతికి తెలుగు నాట ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు చిత్రాలు టాప్ తెలుగు స్టార్స్ అయినా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. 100 కోట్లను వసూలు చేసి రెండు వందల కోట్ల దిశగా తమ పయనం కొనసాగిస్తున్నాయి.
ఇక తెలుగులో విడుదలైన మరో చిన్న చిత్రం సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ నిర్మించి స్వయంగా పంపిణీ చేయడంతో ఈ చిత్రంపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఇక తమిళ్‌లో విజయ్‌తో వారీసు చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు మూడు రోజుల తర్వాత తెలుగులో వారసుడుగా విడుదల చేశారు. మొదట్లో దీనిని ద్విభాషా చిత్రంగా అనౌన్స్ చేసినప్పటికీ చివరకు దీనిని డబ్బింగ్ చిత్రంగా విడుదల చేశారు.
కళ్యాణం కమనీయం, వారసుడు చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిల ఓవర్ ఫ్లో కారణంగా కాస్త కలెక్షన్లు పుంజుకున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందుగా జనవరి 11నే అజిత్ నటించిన తెగింపు చిత్రం డబ్బింగ్ చిత్రం విడుదల అయింది.
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఒకే రోజున రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజున పోటీ లేకపోవడంతో ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. కానీ ఆ తరువాత మిగిలిన చిత్రాల పోటీని తట్టుకోలేక చతికిలబడింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా తెగింపు చిత్రాన్ని డిజిటల్ వేదికగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే తమఙలనాట మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు రెండు భాషల్లో డిజిటల్ రిలీజ్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 10వ తేదీన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను కన్నడ, హిందీ డబ్బింగ్ వర్షన్స్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వారీసు చిత్రాన్ని తమిళ వెర్షన్ అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు.
కానీ వారసుడు తెలుగు వర్షన్‌కి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇక వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలకు మరికొంత సమయం పట్టు అవకాశం ఉంది. అ్రిమెంట్ ప్రకారం 50 రోజులు పూర్తయిన తర్వాత మాత్రమే డిజిటల్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అజిత్ తునీవు, విజయ్ వారీసు చిత్రాలు మాత్రమే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
