HomelatestAkhila Priya | టికెట్ మాట తరువాత... పాపం యువ గళానికి అఖిల ప్రియ దూరం..

Akhila Priya | టికెట్ మాట తరువాత… పాపం యువ గళానికి అఖిల ప్రియ దూరం..

Akhila Priya

విధాత‌: పాపం.. లోకేష్ తన నియోజకవర్గానికి వచ్చేసరికి తన సత్తా చూపించాలి అనుకున్నారు. ఎలాగైనా ఈసారి ఆళ్లగడ్డ టికెట్ తెచ్చుకుని గెలవాలని పంతంతో ఉన్నారు.. తన టికెట్ విషయం ఇప్పటికే లోకేష్ తో పలు మార్లు చర్చించారు కూడా.. కానీ పరిస్థితులు ఎదురు తిరిగి లోకేష్ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసే సమయానికి ఆమె తన ఊళ్ళో లేకుండా పోయారు.

తన తండ్రి సహచరుడు అయినా ఏవి సుబ్బా రెడ్డి మీద దాడి చేసిన కేసులో ఆమె జైల్లో పడ్డారు.. దీంతో ఆమె జైలు ఊచలు నుంచే లోకేష్ పాదయాత్ర సమాచారం తెలుసుకోవాల్సిన ఖర్మ పట్టింది.. ఆమె ఎవరు.. ? ఇంకెవరు భూమా అఖిల ప్రియ. దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన అఖిల ప్రియ..

క‌ర్నూలు జిల్లాలో లోకేశ్ పాద‌యాత్ర అడుగు పెట్టిన నాటి నుంచీ ఆయన వెన్నంటే ఉన్నారు. అయితే ఆయన త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన ఆళ్లగడ్డ చేరేసరికి ఆమె లేక‌పోవ‌డం ఆమె దుస్థితికి అద్దం పడుతోంది.

శ‌నివారం రాత్రి లోకేశ్ పాద‌యాత్ర ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం చేరింది. ఆయన ఆళ్లగడ్డ శివారు గ్రామం అయినా దొర్నిపాడులో రాత్రి బ‌స చేశారు. ఈ తరుణంలో అక్కడి ఇన్‌చార్జిగా ఉన్న అఖిల ప్రియ అక్కడ పార్టీని , క్యాడర్ ను నడిపించాల్సి ఉంది. కానీ అనాలోచిత చర్యల కారణంగా ఆమె చిక్కుల్లో చిక్కుకున్నారు.

నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన నాడు ఆమె, అనుచరులు కలిసి టిడిపి సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామం ఆమెలోని దూకుడు మనస్తత్వాన్ని మరింత స్పష్టం చేసింది.

దీంతో సుబ్బారెడ్డి ఫిర్యాదు మేర‌కు అఖిల‌ప్రియ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఇంకా పోలీస్ కస్ట‌డి కూడా పూర్తి కాలేదు అంటే మీకు ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈ లోపు ఆళ్ల‌గ‌డ్డలో లోకేశ్ పాద‌యాత్ర పూర్తి కానుంది.

ఈ తరుణంలో ఆమె సోదరుడు జ‌గత్‌విఖ్యాత్‌రెడ్డి తాత్కాలికంగా పార్టీ బాధ్య‌త‌ల్ని మోస్తున్నారు. మొత్తానికి టికెట్ సంగతి తరువాత కానీ అఖిల ప్రియకు కనీసం పాదయాత్రలో పాల్గొనే అవకాశం కూడా లేకపోయింది కదా అని ఆమె అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular