ఇప్ప‌టికే 80 గ్రామాలకు అందుతున్న నీరు.. మిగిలిన 40 గ్రామాల‌కు త్వరలో అంద‌జేస్తా.. విధాత, వరంగల్: పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల్లో సాగునీరు, తాగునీరు కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నానని, పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని లక్ష్మక్క పల్లి గ్రామం వద్ద మెయిన్ రోడ్డు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]

  • ఇప్ప‌టికే 80 గ్రామాలకు అందుతున్న నీరు..
  • మిగిలిన 40 గ్రామాల‌కు త్వరలో అంద‌జేస్తా..

విధాత, వరంగల్: పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎన్నికల్లో సాగునీరు, తాగునీరు కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నానని, పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం లోని లక్ష్మక్క పల్లి గ్రామం వద్ద మెయిన్ రోడ్డు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గం లోని 120 గ్రామాలకు కాలువ ద్వారా నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చానని, అందులో ఇప్పటికే 80 గ్రామాలకు నీరు అందుతుందని చెప్పారు.

మిగిలిన 40 గ్రామాల్లో కొంతమంది కోర్టులకు వెళ్లడం, భూమి సమస్యలు , కాంట్రాక్టర్లు పనిచేయకపోవడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయని, ఇప్పుడు అవన్నీ పరిష్కరించుకొని 40 గ్రామాలకు నీరు ఇచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్నారు. అన్ని గ్రామాలకు కచ్చితంగా నీరు వస్తుందని హామీ ఇచ్చారు.

రిజర్వాయర్ నుంచి ఈ నీళ్లను ఆయకట్టు గ్రామాలన్నింటికీ అందించే విధంగా కాల్వపనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూరు కెనాల్ 11 కిలోమీటర్లు కొనసాగుతుందని, దీనిపై 8 బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నామని ఒక్కో బ్రిడ్జికి సుమారుగా రూ.50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.

ప్రజలు గత ప్రభుత్వాలు చేసిన పనులను.. తెలంగాణ వచ్చాక జరుగుతున్న అభివృద్ది పనులను సమీక్ష చేసుకుని అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రైతులు పాల్గొన్నారు.

Updated On 8 Jan 2023 4:08 PM GMT
krs

krs

Next Story