ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన సౌకర్యాలు, విద్యా బోధన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సింగాయపల్లి నర్సింగరావు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా.. All regions should develop in all areas: Narsinga Rao విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: అన్ని ప్రాంతాలు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌ని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంద‌ని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సింగాయపల్లి నర్సింగరావు అన్నారు. సోమవారం మన ఊరి […]

  • ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన సౌకర్యాలు, విద్యా బోధన
  • ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సింగాయపల్లి నర్సింగరావు
  • అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా..

All regions should develop in all areas: Narsinga Rao

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: అన్ని ప్రాంతాలు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌ని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంద‌ని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సింగాయపల్లి నర్సింగరావు అన్నారు. సోమవారం మన ఊరి మన బడి కార్యక్రమం కింద శివ్వంపేట ఉన్నత పాఠశాల, చిన్న గొట్టిముక్కలలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల సుందరీకరణ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షాలతో కలిసి మన ఊరు మన బడి, ఉపాధి హామీ, సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించిన పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ముందుగా శివ్వంపేట మండల కేంద్రంలో కోటి 60 లక్షల 69 వేలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నగొట్టిముక్కలలో సుమారు 87 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకును, డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. కోటి 7 లక్షల 43 వేలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవనం మరమ్మతులు, శౌచాలయాలు, ప్రహరీ గోడల నిర్మాణం, రెండు కోట్ల 28 లక్షలతో అంగన్వాడి, అదనపు తరగతి గదులు నిర్మాణం, బ్యాడ్మింటన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

విద్య‌, వైద్య రంగాల అభివృద్ధితోనే ఆర్థికాభివృద్ధి: న‌ర్సింగ‌రావు

ఈ సందర్భంగా నర్సింగ రావు మాట్లాడుతూ విద్య, వైద్యరంగం సంపూర్ణంగా అభివృద్ధి చెందిన నాడే ఆర్థికంగా అభివృద్ధి సాధించినట్లని అన్నారు. కొన్ని గ్రామాలలో పైలెట్ ప్రాజెక్టుగా విద్య, వైద్యరంగం పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, డిజిటల్ లెర్నింగ్ పద్ధతి ద్వారా బోధనా జరిపి వాటి ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాలలో అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు, విద్యా బోధన ఉందని పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టి బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని అన్నారు.

అభివృద్ధి ప‌నులు విజ‌య‌వంతంగా అమ‌లు..: ఎమ్మెల్యే మ‌ద‌న్‌రెడ్డి

నర్సింగ రావు సహాయ, సహకారాలు, అధికారుల సమన్వయం, సహాకారాలతో ఏ మచ్చ లేకుండా నర్సపూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు పరుస్తున్నామని మదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నరసాపూర్ నియోజక వర్గంలోని గిరిజన తండాలలో 55 కోట్లతో సి.సి. రోడ్లు నిర్మించామని, నియోజక వ‌ర్గంలో రోడ్ల అభివృద్ధికి 82 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే ఏప్రిల్ లో మరో 40 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని, రోడ్లకు మహర్దశ ప‌ట్ట‌నుంద‌న్నారు. 14 చెక్ డ్యామ్ లు నిర్మించుకోవడం ద్వారా మంజీరా నది పరవళ్లు తొక్కుతుందని అన్నారు.

నాణ్యతతో చేసేలా కృషి చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తరచు అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతంగా, నాణ్యతతో చేసేలా కృషి చేస్తున్నానని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు అభ్యాస దీపికలు అందజేశామని, సాయంకాలం స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు. పదో తరగతిలో విద్యార్థులు 10కి 10 జిపిఎ సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. పుట్టిన ఊరు, పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్న నర్సింగ్ రావు ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్ధి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు

కార్యక్రమంలో ఇందినం ఎకనామిక్స్ అండ్ స్టాట్సిటికల్ సర్వీసెస్ అధికారులు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, జడ్పిటిసి మహేష్ గుప్తా, ఎంపీపీ హరికృష్ణ, ఆర్డిఓ సాయిరాం, డీఈఓ రాధా కిషన్, డిపిఓ సాయిబాబా, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, మండల ప్రత్యేకాధికారి నరసయ్య, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, సిడిపిఓ హేమం భార్గవి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated On 6 March 2023 3:24 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story