ప్ర‌భుత్వ అనుమ‌తులు నిబంధనలా.. లేదా ప్రతిబంధకాలా! ధ్వజమెత్తుతున్న‌ TDP నాయకులు  26న శ్రీ‌వారి ద‌ర్శ‌నం 27న కుప్పం నుంచి యాత్ర ప్రారంభం విధాత‌: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇంట్లో పూజలు అనంతరం తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు.. అత్తమామలు బాలయ్య.. వసుంధరల ఆశీస్సులు తీసుకుని లోకేష్ 4000 కిలోమీటర్లు అడుగులు వేసేందుకు సంసిద్ధులు అయ్యారు. జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుండగా ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా జనవరి […]

  • ప్ర‌భుత్వ అనుమ‌తులు నిబంధనలా.. లేదా ప్రతిబంధకాలా!
  • ధ్వజమెత్తుతున్న‌ TDP నాయకులు
  • 26న శ్రీ‌వారి ద‌ర్శ‌నం
  • 27న కుప్పం నుంచి యాత్ర ప్రారంభం

విధాత‌: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇంట్లో పూజలు అనంతరం తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు.. అత్తమామలు బాలయ్య.. వసుంధరల ఆశీస్సులు తీసుకుని లోకేష్ 4000 కిలోమీటర్లు అడుగులు వేసేందుకు సంసిద్ధులు అయ్యారు.

జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుండగా ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా జనవరి 25 రాత్రికి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే నిద్ర చేసి 26వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.

జనవరి 26 ఉదయం 10.30 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వెళ్తారు. 26వ తేదీ సాయంత్రం నారా నందమూరి కుటుంబ సభ్యులు కుప్పం వస్తారని తెలుస్తోంది. 27వ తేదీ నందమూరి నారా కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నాక కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది.

ఇదంతా ఓకేగానీ ఆయన యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా గట్టి నిబంధనలు రూపొందించింది.
నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి షరతులు విధించారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అంతే కాకుండా రాష్ట్రం మొత్తం పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా కేవలం మొదటి మూడు రోజులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడం గమనార్హం.

ఈ మేరకు పలమనేరు డీఎస్పీ కుప్పం నియోజకవర్గంలో జరిగే మొదటి మూడు రోజుల పాదయాత్రకు మాత్రమే అనుమతి ఇవ్వడం వివాదం రేపుతోంది. అలాగే లోకేష్ పాదయాత్రకు సంబంధించి మొత్తం 15 షరతులు, నిబంధనలు పెట్టారని చెబుతున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్లు ఫిర్యాదులొచ్చినా షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ముందస్తు సమాచారం నోటీసు ఇవ్వకుండానే అనుమతి రద్దు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఈ అనుమతులు జనవరి 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29 సాయంత్రం 5.55 గంటల వరకు మూడు రోజుల పాటే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

మైకు వాడినా బాణసంచా కాల్చినా డీజే బాక్సులు పెట్టినా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపైన సభలు పెట్టినా అనుమతులు రద్దు చేస్తామని పోలీసులు పేర్కొనడం వివాదం రేపుతోంది. అనుమతించిన మేర కంటే ఎక్కువ వాహనాలు పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఏ జిల్లాకు ఆ జిల్లాలో పోలీసుల అనుమతులు తీసుకోవాలని చెప్పడం పాదయాత్రకు సంబంధించి టీడీపీ వారే పురుష, మహిళా వలంటీర్లను నియమించుకోవాలని చెప్పడం అంబులెన్సులను సైతం టీడీపీయే సిద్ధం చేసుకోవాలని సూచించిడం, అగ్నిమాపక వాహనం కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టకూడదని ఆదేశించడం.. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించడం పాదయాత్రను అడ్డుకోవడానికేనని టిడిపి నాయకులు ధ్వజమెత్తుతున్నారు

Updated On 25 Jan 2023 3:13 PM GMT
krs

krs

Next Story